సీపీఎం నాయకుడి కీచకపర్వం: ఆరేళ్ల చిన్నారిపై మూడేళ్లుగా అత్యాచారం.. ఆపై ఉరేసి

దిశ, వెబ్‌డెస్క్: ఆరేళ్ళ చిన్నపిల్ల అని కూడా చూడలేదు ఆ కామాంధుడు. మాటలు కూడా రాని ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడికట్టాడు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా మూడేళ్లు చిన్నారిని చిత్రహింసలు పెట్టాడు. స్వీట్లు ఇస్తానని ఆశచూపి చిన్నారి బతుకును చిదిమేశాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.  కేరళలో గత నెల ఆరేళ్ల  బాలిక హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, హత్యచేసిన సీపీఎం […]

Update: 2021-07-06 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆరేళ్ళ చిన్నపిల్ల అని కూడా చూడలేదు ఆ కామాంధుడు. మాటలు కూడా రాని ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడికట్టాడు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా మూడేళ్లు చిన్నారిని చిత్రహింసలు పెట్టాడు. స్వీట్లు ఇస్తానని ఆశచూపి చిన్నారి బతుకును చిదిమేశాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. కేరళలో గత నెల ఆరేళ్ల బాలిక హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, హత్యచేసిన సీపీఎం యువజన నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాలలోకి వెళితే ఇడుక్కిజిల్లాకు చెందిన అర్జున్(22) సీపీఎం యువజన నేతగా కేరళలో పనిచేస్తున్నాడు. కాగా, అర్జున్ మూడేళ్ల నుంచి వారి ఇంటి పక్కన ఉండే ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చిన్నారికి స్వీట్స్ ఇస్తానని ఆశచూపి ఆమెను లైంగికంగా వేధించేవాడు. తల్లితండ్రులకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియని బాలిక మౌనంగా ఉండిపోయింది. ఇదే అదునుగా చేసుకున్న అర్జున్ మూడేళ్లుగా బాలికపై అరాచకానికి పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే జూన్ 30న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చిన్నారి స్రృహ కోల్పోవడంతో ఆమె మృతిచెందిందని భయపడి రూమ్‌లో ఆమెను ఊపిరాడకుండా చేసి ఉరి తీసి పరారయ్యాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. నివేదికలో బాలికపై లైంగిక వేధింపులు జరిగాయని వెల్లడైంది. దర్యాప్తులో సీపీఎం యువజన నేత అర్జున్ యే నిందితుడిగా నిర్దారించుకున్న పోలీసులు సోమవారం అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News