రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది: సీపీఎం మధు

దిశ, ఏపీ బ్యూరో: పునర్విభజన చట్టంలోని అంశాలను రాబట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పన్నుల చట్టాన్ని తెచ్చిన బీజేపీకి కేంద్రం మద్దతిస్తోందని విమర్శించారు. బీజేపీకి వైసీపీ మద్దతుగా నిలుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను సైతం హరించేలా కేంద్రం వ్యవహరిస్తోన్న కనీసం ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల […]

Update: 2021-08-22 06:03 GMT

దిశ, ఏపీ బ్యూరో: పునర్విభజన చట్టంలోని అంశాలను రాబట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పన్నుల చట్టాన్ని తెచ్చిన బీజేపీకి కేంద్రం మద్దతిస్తోందని విమర్శించారు. బీజేపీకి వైసీపీ మద్దతుగా నిలుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను సైతం హరించేలా కేంద్రం వ్యవహరిస్తోన్న కనీసం ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాల రాస్తోందని విరుచుకుపడ్డారు. అటవీ, మైనర్ పోర్టులపై చట్ట సవరణలు చేసి రాష్ట్రాల ఆర్థిక వనరులను హరిస్తోందని ధ్వజమెత్తారు. ఏపీకి విభజన హామీలు అమలు చేయడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 15 నుంచి 30 వరకు నిరసనలు చేపట్టబోతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వెల్లడించారు.

Tags:    

Similar News