బీజేపీ విధానాలపై సీపీఎం ఫైర్.. ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా

దిశ, బోనకల్: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో మండల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ…. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తుందన్నారు. ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలం నుంచి రైతులు ఉద్యమాలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే […]

Update: 2021-11-26 05:05 GMT

దిశ, బోనకల్: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో మండల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ…. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తుందన్నారు. ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలం నుంచి రైతులు ఉద్యమాలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ చట్టాలను రద్దు చేసి రైతాంగానికి కావాల్సిన వ్యవసాయ వనరులను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లకుల శ్రీనివాస రావు, తుల్లూరు రమేష్, విశ్వనాథన్ లక్ష్మణ్ రావు. తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News