కరేబియన్ దీవుల్లో క్రికెట్ పండుగ
దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వలన లైవ్ మ్యాచ్‌లు లేక క్రికెట్ ప్రేమికులు(Cricket lovers) అల్లాడిపోతున్నారు. ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచ్‌లు జరుగుతున్నా, అసలు సిసలైన క్రికెట్ మస్తీ ఇచ్చే టీ20 మ్యాచ్‌ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian premiare league) ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలియగానే అందరికీ ప్రాణం లేచొచ్చింది. కానీ దానికి ఇంకా మరో నెల రోజులకు పైగా […]
దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వలన లైవ్ మ్యాచ్‌లు లేక క్రికెట్ ప్రేమికులు(Cricket lovers) అల్లాడిపోతున్నారు. ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచ్‌లు జరుగుతున్నా, అసలు సిసలైన క్రికెట్ మస్తీ ఇచ్చే టీ20 మ్యాచ్‌ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian premiare league) ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలియగానే అందరికీ ప్రాణం లేచొచ్చింది. కానీ దానికి ఇంకా మరో నెల రోజులకు పైగా సమయం ఉంది. ఆలోపు మెయిన్ కోర్స్‌కు ముందు స్టార్టర్‌లా, ఐపీఎల్‌కు ముందు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (Carebian premiare league) ప్రారంభం కానుంది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే సీపీఎల్ ( CPL) కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో క్రికెట్ ప్రేమికులను సీపీఎల్ పండుగ వాతావరణంలోకి తీసుకెళ్లనుంది. ఆరు జట్లు ఆగస్టు 18నుంచి సెప్టెంబర్ 10వరకు సీపీఎల్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి.
ఎలా ప్రారంభమైంది?
వెస్టిండీస్ (West indies)లో టీ20 (T20) క్రికెట్ మొదటి నుంచి చాలా ఆదరణ పొందింది. 2006లో కరేబియన్ దీవుల్లో స్టాన్‌ఫోర్డ్ ట్వంటీ20 పేరుతో ఒక టోర్నీ ప్రారంభించారు. కానీ రెండేళ్లకే విండీస్ క్రికెట్ దాన్ని రద్దు చేసింది. ఆ లీగ్‌ను నిర్వహించిన స్టాన్‌ఫోర్డ్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడటంతో అతడిని 2009లో అరెస్టు చేశారు. ఆ తర్వాత విండీస్ బోర్డు కరేబియన్ ట్వంటీ20 అనే లీగ్ ప్రారంభించింది. ఆ తర్వాత కరేబియన్ టీ20ని రద్దు చేసి 2013లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)ను ప్రారంభించింది. ఇప్పటివరకు ఏడు సీజన్లు నిర్వహించగా, ఇప్పడు జరుగబోయేది ఎనిమిదవ సీజన్. మొత్తం ఆరు జట్లతో లీగ్, ప్లేఆఫ్స్ విధానంలో నిర్వహిస్తున్నారు.
ఆదరణ ఎక్కువే..
ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో క్రికెట్ లీగ్ జరిగినా అందులో వెస్టిండీస్ క్రికెటర్లు ఉంటారు. ఐపీఎల్, బీబీఎల్‌లో వీరికి అమితమైన డిమాండ్ ఉంది. వీరు ఇంతలా రాణించడానికి కారణం సీపీఎల్ అని చెప్పకతప్పదు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే సీపీఎల్ జరుగుతుంది. ఈ సమయంలో వేరే ఎక్కడా క్రికెట్ లీగ్స్ జరగవు. దీంతో ఈ లీగ్‌కు కరేబియన్ దీవుల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆదరణ ఉంది. వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్లతో పాటు యువ క్రికెటర్లు కూడా ఈ లీగ్ ఆడుతుండటంతో మంచి టీఆర్పీ రేటింగ్స్ (Trp ratings) కూడా వస్తున్నాయి. ఈ లీగ్‌లో ఆడే ఆటగాళ్లకు ప్రతి సీజన్‌లో దాదాపు 10లక్షల డాలర్ల వేతనం లభిస్తున్నది.
ఈ ఏడాది ఇలా..
ప్రతి ఏడాది సీపీఎల్ మ్యాచ్‌లను కరేబియన్ దీవుల్లోనే కాకుండా అమెరికా (America)లోని ఫ్లోరిడా (Florida)లో కూడా నిర్వహిస్తున్నారు. జమైకా తల్లవాస్ జట్టు జమైకాలోని సబీనా పార్క్‌తోపాటు యూకేలోని ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్‌ను తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకుంది. వీటితోపాటు వార్నర్ పార్క్, డారన్ సామీ స్టేడియం, క్వీన్స్ పార్క్ ఓవల్, బ్రియన్ లారా స్టేడియం, కింగ్‌స్టన్ ఓవల్, ప్రొవిడెన్స్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగేవి. కాగా, ఈసారి కొవిడ్-19 (Covid-19) కారణంగా రెండు స్టేడియాలకు మాత్రమే సీపీఎల్‌ను పరిమితం చేశారు.
గత జూన్‌లో సీపీఎల్ నిర్వహణకు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వాన్ని అనుమతులు కోరగా పచ్చజెండా ఊపింది. కానీ, సీపీఎల్‌ను ప్రేక్షకులు లేకుండా రెండు స్టేడియాల్లో మాత్రమే ఆడటానికి అనుమతులు ఇచ్చింది. తరోబాలోని బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ స్టేడియంలో 23 మ్యాచ్‌లు, సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌తో కలిపి మరో 10 మ్యాచ్‌లు క్వీన్స్ పార్క్ ఓవల్‌లో బయోసెక్యూర్ వాతావరణంలో నిర్వహించనున్నారు.
జట్లు ఇవే :
బార్బడోస్ ట్రైడెంట్స్, గయానా అమెజాన్ వారియర్స్, జమైకా తల్లవాస్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్, సెయింట్ లూసియా జవుక్స్, ట్రిబాగో నైట్ రైడర్స్