రైతు ఉద్యమం మోడీకి గుణపాఠం కావాలి
దిశ, ఖమ్మం: రైతు ఉద్యమం మోడీకి గుణపాఠం కావాలని ఢిల్లీ రైతు ఉద్యమ కోర్ కమిటీ సభ్యులు, అఖిల భారత రైతుకూలీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ సభలో అయన ముఖ్యఅతిథిగా పొల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలతో వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు […]
దిశ, ఖమ్మం: రైతు ఉద్యమం మోడీకి గుణపాఠం కావాలని ఢిల్లీ రైతు ఉద్యమ కోర్ కమిటీ సభ్యులు, అఖిల భారత రైతుకూలీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ సభలో అయన ముఖ్యఅతిథిగా పొల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలతో వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టడమే అని విమర్శించారు. భారత దేశంలో ప్రకృతి సంపదలు అన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. మోడీ హిట్లర్‌ల వ్యవహరిస్తున్నాడని, పోలీసులతో రైతు ఉద్యమాన్ని అణచివేయాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. మోదీ తెచ్చిన చట్టాలు తెలంగాణలోనే మొదట అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు.
ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమం జరుగుతున్నా మోడీ సర్కార్ దిగి రాకపోడం అహంకారానికి నిదర్శనమన్నారు. తొలుత ఖమ్మం నగరంలో న్యూడెమోక్రసీ అధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో 4 వేల మంది రైతులు ఎర్రజెండాలతో ఇల్లందు క్రాస్ రోడ్డు, కలెక్టర్ ఆఫీస్ నుంచి బస్టాండ్ మీదుగా పెలియన్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఈ ర్యాలీలో అరుణోదయ కళాకారులు ఆధ్వర్యంలో ఇరువురు రైతులు నాగలితో ఉండగా వారి వెనకాల అదానీ, అంబానీ, మోదీ వేషధారణతో కూడిన ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రదర్శన అగ్రభాగాన ఢిల్లీ రైతు ఉద్యమ నాయకులు ఆశిష్ మిటల్, కోదండరామ్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాయల చంద్రశేఖర్, కే.రంగయ్య, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, చంద్ర అరుణ, గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, అశోక్, పుల్లయ్య, రామయ్య అగ్రనాయకత్వం పాల్గొన్నారు.