అది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం : తమ్మినేని వీరభద్రం

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం డాక్టర్లకు రక్షణ కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కి నిరసన చేయడం డాక్టర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యనికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ విషయమైన బుధవారం తమ్మినేని ఓ ప్రకటన చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో డాక్టర్లు తమ విధుల్లో పూర్తిగా నిమగ్నమవుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు […]

Update: 2020-06-10 10:45 GMT
అది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం : తమ్మినేని వీరభద్రం
  • whatsapp icon

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం డాక్టర్లకు రక్షణ కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కి నిరసన చేయడం డాక్టర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యనికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ విషయమైన బుధవారం తమ్మినేని ఓ ప్రకటన చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో డాక్టర్లు తమ విధుల్లో పూర్తిగా నిమగ్నమవుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వాంఛనీయం కాదని పేర్కొన్నారు. గతంలో కూడా రక్షణ లేదని డాక్టర్లు ఆందోళన చేపట్టారని గుర్తుచేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. రోగులకు సకాలంలో సరైన వైద్య సేవలు అందించటంలో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకొని డాక్టర్లకు పూర్తి రక్షణ కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News