అమరావతి ఉద్యమం చారిత్రాత్మకమైనది: సీపీఐ రామకృష్ణ

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధాని కోసం ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం చారిత్రాత్మకమైనదని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని విషయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ చోద్యం చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అమరావతి విషయంలో ప్రభుత్వం చాలా విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఇది చాలా దుర్మార్గమన్నారు. మరోవైపు బీజేపీపైనా రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో బీజేపీ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు […]

Update: 2021-11-17 04:45 GMT

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధాని కోసం ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం చారిత్రాత్మకమైనదని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని విషయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ చోద్యం చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అమరావతి విషయంలో ప్రభుత్వం చాలా విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఇది చాలా దుర్మార్గమన్నారు. మరోవైపు బీజేపీపైనా రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో బీజేపీ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.

ప్రధాని మోడీ, అమిత్ షాలు నేరుగా జగన్‌కు ఫోన్ చేసి అమరావతి రాజధానిగా ఉంచాలని సలహా ఇవ్వొచ్చు కదా అంటూ నిలదీశారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. సోలార్ విద్యుత్ కొనుగోలును 22 రాష్ట్రాలు వ్యతిరేకిస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అంగీకారం తెలుపుతూ ఒక్కరోజులోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అదానీతో సీఎం జగన్‌కు ఉన్న లాలూచీయే అందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో వేల కోట్ల గోల్ మాల్ జరిగిందని చెప్పడానికి ఇదే నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ సూచించారు.

Tags:    

Similar News