ఓ రాజకీయ పార్టీ ఉనికి కోసమే విగ్రహాల ధ్వంసం : నారాయణ

దిశ, ఏపీబ్యూరో : రాష్ర్టంలో ఓ రాజకీయ పార్టీ ఉనికి కోసమే విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహాలను పూజించేవాళ్లే ధ్వంసానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కూడా అధికార ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఏపీలో ప్రభుత్వం మీద ప్రభుత్వమే పోరాడుతోందని చెప్పారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం ఎవరికీ లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని […]

Update: 2021-01-10 09:46 GMT

దిశ, ఏపీబ్యూరో : రాష్ర్టంలో ఓ రాజకీయ పార్టీ ఉనికి కోసమే విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహాలను పూజించేవాళ్లే ధ్వంసానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కూడా అధికార ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.

ఏపీలో ప్రభుత్వం మీద ప్రభుత్వమే పోరాడుతోందని చెప్పారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం ఎవరికీ లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు తలెత్తినట్లు నారాయణ చెప్పారు. అధికార, ప్రతిపక్షాలు సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలని నారాయణ సూచించారు.

Tags:    

Similar News