బసవతారక నగర్ బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించాలి: సీపీఐ నాయకులు డిమాండ్
దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే బసవతారక నగర్ వాసులకు అక్కడనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని శేరిలింగంపల్లి సిపిఐ నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు. పేదల గుడిసెల కూల్చివేతలో కొత్త కోణం పేరిట దిశ దిన పత్రికలో ప్రచురితమైన కథనం నేపథ్యంలో సీపీఐ నాయకులు గచ్చిబౌలి డివిజన్ బసవతారకనగర్ లో బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. పేదల గుడిసెలు కూలుస్తూ […]
దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే బసవతారక నగర్ వాసులకు అక్కడనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని శేరిలింగంపల్లి సిపిఐ నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు. పేదల గుడిసెల కూల్చివేతలో కొత్త కోణం పేరిట దిశ దిన పత్రికలో ప్రచురితమైన కథనం నేపథ్యంలో సీపీఐ నాయకులు గచ్చిబౌలి డివిజన్ బసవతారకనగర్ లో బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. పేదల గుడిసెలు కూలుస్తూ వారిని రోడ్డున పడేస్తున్న ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉండి, అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు కలిగి ఉన్న బాధితులను కాదని ప్రభుత్వం బడా రియలేస్టేట్ వ్యాపారులకు భూములను అప్పగించేందుకు పేదల ఇళ్లు కూల్చారని సీపీఐ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం బసవతారక నగర్ వాసులకు న్యాయం చేసేంత వరకు సీపీఐ పేదల పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు. ఇక్కడే వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కె. చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.