నిమజ్జన ఏర్పాట్లపై రామగుండం కమిషనర్ కీలక ఆదేశాలు..
దిశ, గోదావరిఖని : రామగుండం చుట్టు పక్కల గ్రామాల్లో సుమారు 250 వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతమైన గోలివాడ గోదావరి పుష్కర ఘాట్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి శనివారం పరిశీలించారు. గణనాథులు గోదావరి వద్దకు వచ్చేందుకు, మరల వాహనాలు బయటకు వెళ్లే చుట్టుపక్కల ప్రదేశాలు, క్రేన్లు అమర్చే ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని […]
దిశ, గోదావరిఖని : రామగుండం చుట్టు పక్కల గ్రామాల్లో సుమారు 250 వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతమైన గోలివాడ గోదావరి పుష్కర ఘాట్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి శనివారం పరిశీలించారు. గణనాథులు గోదావరి వద్దకు వచ్చేందుకు, మరల వాహనాలు బయటకు వెళ్లే చుట్టుపక్కల ప్రదేశాలు, క్రేన్లు అమర్చే ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
గోదావరి పూర్తిగా నిండి ఉన్నందున చిన్నపిల్లలు గోదావరిలో దిగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత డిపార్ట్‌మెంట్ అధికారులతో బారికేడ్స్ ఏర్పాటు చేయించాలన్నారు. ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. లైటింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు వసతి కల్పించాలన్నారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ వివరించారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఉమెందర్, రామగుండం సీఐ లక్ష్మినారాయణ, ఎస్ఐ శ్రీధర్, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.