వారు ముందుకు రావాలి: సీపీ సత్యనారాయణ

దిశ ప్రతినిధి, కరీంనగర్: సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతుల హత్యకేసులో ఆధారాలు సేకరించేందుకు పోలీసులు సరికొత్తగా ముందుకు సాగుతున్నారు. హైకోర్టు అడ్వకేట్స్ గట్టు వామన్ రావు, ఆయన భార్య పీవీ నాగమణిలు ఈ నెల 17న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. పెద్దపల్లి- మంథని రోడ్డుపై ఈ హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించిన వారు ప్రత్యక్ష్యంగా చూడడం కానీ, మొబైల్స్‌లో వీడియో రికార్డింగ్ చేయడం కాని చేసినట్టయితే వాటిని తమకు అప్పగించాలని […]

Update: 2021-02-20 07:55 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతుల హత్యకేసులో ఆధారాలు సేకరించేందుకు పోలీసులు సరికొత్తగా ముందుకు సాగుతున్నారు. హైకోర్టు అడ్వకేట్స్ గట్టు వామన్ రావు, ఆయన భార్య పీవీ నాగమణిలు ఈ నెల 17న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. పెద్దపల్లి- మంథని రోడ్డుపై ఈ హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించిన వారు ప్రత్యక్ష్యంగా చూడడం కానీ, మొబైల్స్‌లో వీడియో రికార్డింగ్ చేయడం కాని చేసినట్టయితే వాటిని తమకు అప్పగించాలని సీపీ సత్యనారాయణ కోరారు.

ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికే అడిషనల్ డీసీపీ అశోక్‌కు కొందరు పంపిచారని, మిగతా వారు కూడా పంపించాలని కోరారు. 8500136910 నెంబర్‌లో అడిషనల్ డీసీపీ అందుబాటులో ఉంటారని సీపీ వివరించారు. హత్య కేసు దర్యాప్తులో ఆధారాలు అందించి పోలీసులకు సహకరించాలన్నారు.

Tags:    

Similar News