పట్టువిడువని కార్యకర్తలు.. పెళ్లింట్లోనే వ్యాక్సినేషన్..

దిశ, వెబ్ డెస్క్: కరోనా కోరలు వంచడానికి మనకున్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. అయితే చాలా మందికి ఉన్న అపోహలు వల్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే ఆరోగ్య కార్యకర్తలు మాత్రం పట్టువిడువని విక్రమార్కుల్లా అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇంతకు ముందులా వ్యాక్సినేషన్ సెంటర్ల ముందు క్యూ కట్టాల్సిన పని లేకుండా ప్రజల వద్దకే వ్యాక్సిన్ లను తీసుకు వస్తున్నారు. అంతేనా, జనాలు ఎక్కడ కనబడితే అక్కడ ప్రత్యక్షమై విధుల నిర్వహిస్తున్నారు. పెళ్లిమండపాలకు సైతం […]

Update: 2021-12-09 22:26 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా కోరలు వంచడానికి మనకున్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. అయితే చాలా మందికి ఉన్న అపోహలు వల్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే ఆరోగ్య కార్యకర్తలు మాత్రం పట్టువిడువని విక్రమార్కుల్లా అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇంతకు ముందులా వ్యాక్సినేషన్ సెంటర్ల ముందు క్యూ కట్టాల్సిన పని లేకుండా ప్రజల వద్దకే వ్యాక్సిన్ లను తీసుకు వస్తున్నారు. అంతేనా, జనాలు ఎక్కడ కనబడితే అక్కడ ప్రత్యక్షమై విధుల నిర్వహిస్తున్నారు.

పెళ్లిమండపాలకు సైతం పోయి అక్కడ వ్యాక్సిన్ తీసుకోని వారందరినీ గుర్తించి మరీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తున్నారు. తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వధూవరులను ఆశీర్వదించడానికి బంధువులతో కోలాహలంగా మారిన పెళ్లింట్లోకి వ్యాక్సిన్లు తీసుకుని ఆరోగ్య కార్యకర్తలు వచ్చారు. అక్కడ కూర్చున్న వారందరి వివరాలు అడగి తెలుసుకుని, వ్యాక్సిన్లు ఇచ్చారు.

అందులో మెదటి డోసు కూడా తీసుకోని వాళ్లు ఉన్నారు. ఈ పెళ్లింట్లోనే ఏకంగా 122 మందికి వ్యాక్సిన్ పూర్తి చేశారు. పెళ్లిళ్లే కాదండోయ్. కమ్యూనిటీ హాళ్లూ, ఫంక్షన్ హాళ్లు.. ఇలా ఎక్కడ గుంపు కనిపిస్తే అక్కడికి వెళ్లి వ్యాక్సినేషన్ చేస్తున్నారు.

Tags:    

Similar News