ఖమ్మంలో ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు

దిశ, ఖమ్మం: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన ఖమ్మం నగరంలోని 10 ప్రైవేట్ ఆసుపత్రులకు కొవిడ్ వైద్య సేవల అనుమతులను రద్దు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని విశ్వాస్ ముల్టీస్పెషాలిటీ హాస్పిటల్, క్యూర్ హాస్పిటల్, ప్రశాంతి హాస్పిటల్స్, మార్వెల్, జనని చిల్డ్రన్ హాస్పిటల్, ఇండస్ హాస్పిటల్, విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ బాలాజీ చెస్ట్, డయాబేటాలాజి సెంటర్, న్యూ హోప్ హాస్పిటల్, సంకల్ప సి […]

Update: 2021-05-30 00:57 GMT

దిశ, ఖమ్మం: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన ఖమ్మం నగరంలోని 10 ప్రైవేట్ ఆసుపత్రులకు కొవిడ్ వైద్య సేవల అనుమతులను రద్దు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని విశ్వాస్ ముల్టీస్పెషాలిటీ హాస్పిటల్, క్యూర్ హాస్పిటల్, ప్రశాంతి హాస్పిటల్స్, మార్వెల్, జనని చిల్డ్రన్ హాస్పిటల్, ఇండస్ హాస్పిటల్, విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ బాలాజీ చెస్ట్, డయాబేటాలాజి సెంటర్, న్యూ హోప్ హాస్పిటల్, సంకల్ప సి స్టార్ హాస్పిటల్స్‌కు కొవిడ్ సేవలను అందించడంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినట్లు టాస్క్ ఫోర్స్ బృందం నిర్దారించారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోన సదరు హాస్పిటల్స్‌కు కొవిడ్ సేవల అనుమతులను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించవల్సిందిగా సూచించారు.

Tags:    

Similar News