కొవిడ్ ఆస్పత్రి పై నుంచి దూకిన మహిళ
దిశ, వెబ్ డెస్క్: కోవిడ్ ఆస్పత్రి భవనం పై నుంచి మహిళా పేషెంట్ దూకిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని కోవిడ్ ఆస్పత్రిలో చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఓ మహిళ కరోనా చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం ఆమె కరోనా నుంచి కోలుకుంది. ఈ సందర్భంలో ఆమెను ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కానీ, కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆస్పత్రి భవనం […]
దిశ, వెబ్ డెస్క్: కోవిడ్ ఆస్పత్రి భవనం పై నుంచి మహిళా పేషెంట్ దూకిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని కోవిడ్ ఆస్పత్రిలో చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఓ మహిళ కరోనా చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం ఆమె కరోనా నుంచి కోలుకుంది.
ఈ సందర్భంలో ఆమెను ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కానీ, కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆస్పత్రి భవనం పై నుంచి దూకింది. దీంతో ఆ పేషెంట్ కు తీవ్ర గాయాలయ్యాయి.