లిబర్టీ ఆస్పత్రికి కొవిడ్​ సెంటర్​ రద్దు

దిశ, ఏపీ బ్యూరో: లక్షల్లో ఫీజు వసూలు చేసి తన భర్త ప్రాణాలు పోగొట్టారని విజయవాడ లిబర్టీ ఆస్పత్రి యాజమాన్యంపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఘటనపై సీరియస్‌ అయిన కలెక్టర్ ఇంతియాజ్ లిబర్టీ ఆస్పత్రిలో కొవిడ్‌ వైద్యం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రికి చెందిన మహిళ ఫిర్యాదుతో విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయగా.. ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లు తేలింది. కమిటీ నివేదికతో ఆటోనగర్‌లో ఉన్న లిబర్టీ ఆస్పత్రిలో […]

Update: 2020-09-13 06:53 GMT

దిశ, ఏపీ బ్యూరో: లక్షల్లో ఫీజు వసూలు చేసి తన భర్త ప్రాణాలు పోగొట్టారని విజయవాడ లిబర్టీ ఆస్పత్రి యాజమాన్యంపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఘటనపై సీరియస్‌ అయిన కలెక్టర్ ఇంతియాజ్ లిబర్టీ ఆస్పత్రిలో కొవిడ్‌ వైద్యం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రికి చెందిన మహిళ ఫిర్యాదుతో విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయగా.. ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లు తేలింది. కమిటీ నివేదికతో ఆటోనగర్‌లో ఉన్న లిబర్టీ ఆస్పత్రిలో కరోనా వైద్యం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చికిత్స పొందుతున్న కరోనా బాధితులను వేరే చోటికి తరలించాలని ఆదేశించారు.

Tags:    

Similar News