Young Waves-2025:‘వచ్చే ఏడాది ఆ రికార్డుని తిరగ రాద్దాం’.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

మచిలీపట్నం హిందూ కాలేజీ మైదానంలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉల్లాసంగా కొనసాగుతున్న యువ కెరటాలు-2025 రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్య కార్యదర్శి

Update: 2025-01-04 10:19 GMT

దిశ,వెబ్‌డెస్క్: మచిలీపట్నం హిందూ కాలేజీ మైదానంలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉల్లాసంగా కొనసాగుతున్న యువ కెరటాలు-2025 రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్య కార్యదర్శి హెట్సిబా ఐఏఎస్, నేవీ లెఫ్ట్ నెంట్ కమాండర్ నరేష్ హజరయ్యారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. 2014లో చిన్న కార్యక్రమంగా ప్రారంభించాం. గత ఐదేళ్లు రాజకీయ నాయకుల సంకుచిత మనస్తత్వం కారణంగా ఈ ఉత్సవాలు ఆగిపోయాయి అన్నారు. మళ్ళీ యువ కెరటాలు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ప్రారంభించుకున్నామని తెలిపారు. యువతలో చైతన్యం నింపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన కోసం, మన దేశం కోసం అండగా నిలబడేది త్రివిధ దళాలే 10,300 మందితో డ్రాయింగ్ నిర్వహించామని తెలిపారు. వచ్చే ఏడాది ఆ రికార్డుని తిరగ రాద్దాం. మనం తిరగరాసే రికార్డులను బ్రేక్ చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చే సంవత్సరం సృష్టిద్దాం. ఒకప్పుడు మచిలీపట్నంలో హిందూ కాలేజీ, నేషనల్ కాలేజ్, నోబుల్ కాలేజీ విద్యార్థులే ఎక్కడ చూసినా కనిపించారు.

అలాంటి ప్రాబల్యాన్ని ప్రస్తుతం కోల్పోయాం. ఉన్నత చదువుల కోసం మన పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సి వస్తోంది. సీఎం చంద్రబాబు సహకారంతో.. గ్లోబల్ కెపెబల్ సెంటర్ నేషనల్ కాలేజీలో ఏర్పాటు చేయబోతున్నాం. అందుకు సీఎం చంద్రబాబు కూడా అంగీకరించడం సంతోషంగా ఉంది. మన ప్రాంతంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగాలు కల్పించి తీరుతా ఉద్యోగాలు చేయాలనుకోవడమే కాకుండా.. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామిక వేత్తను తీసుకొస్తా అన్నారు. గ్రీన్ కో లాంటి మరింత మందిని మన బందరు నుంచి తీసుకు రావాలనే లక్ష్యంతో MSME రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించాం. బందరు అంటే చేపలు, రొయ్యలు కాదు.. అంతకు మించి అనేలా తయారు చేసే బాధ్యత తీసుకుంటాను. త్వరలోనే మన యువతలో ఉన్న స్కిల్స్ అన్నీ గుర్తించి ఆయా దిశగా ప్రోత్సహించే బాధ్యత తీసుకుంటాను. మచిలీపట్నం అంటే ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్ అనేలా తయారు చేసి చూపిస్తానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

Tags:    

Similar News