రాష్ట్రంలో మతమార్పిడిలు పెరిగాయి.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
వీహెచ్‌పీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ,వెబ్‌డెస్క్: వీహెచ్‌పీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా హైందవ శంఖారావం సభలు నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ (VHP Leader ) గోకరాజు గంగరాజు(Gokaraju Rangaraju) తెలిపారు. విజయవాడ(Vijayawada)కు సమీపంలో కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మత మార్పిడులు పెరిగాయని ఆరోపించారు. ఇతర మతస్థులు దేవాలయాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు. హిందువుల స్వేచ్చ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచే పోరాటం మొదలు పెట్టామని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజల నాడి తెలుసుకుని నడుచుకోవాలని సూచించారు. రేపు(ఆదివారం) విజయవాడలో హైందవ శంఖారావం సభ మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం వరకు జరుగుతుందని తెలిపారు.