ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకం పెరిగేలా చేస్తాం: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా చేస్తామని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) హామీ ఇచ్చారు. ఈ రోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal scheme) విజయవాడ సమీపంలోని ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులతో మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వైపు వెళ్ళవద్దని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని.. రాష్ట్ర ప్రజలకు విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థల(Government educational institutions)పై నమ్మకం(trust) పెంపొందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటుగా ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలా పని చేయాలనే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి లోకేప్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు మనం బాగా చదవాలని మన కోసం కష్టపడతారని.. వారి కష్టానికి తగ్గట్లుగా విద్యార్థులు చదువుకోవాలని, రాజకీయాలను ప్రభుత్వ విద్యకు దూరం పెట్టాలనేది నేను తీసుకున్న తొలి నిర్ణయం తీసుకున్నానని, రాజకీయ నేతల చిత్రాలు ఉండకూడదనే కారణంతోనే విద్యాశాఖలో పథకాలకు మహోన్నత వ్యక్తుల పేర్లు పెట్టామని.. ఇందులో భాగంగానే.. అందుకే డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చామని నారా లోకేశ్ చెప్పుచ్చారు.
విశ్వవిద్యాలయాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగు పరుస్తాము
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్(NIRF Rankings) మెరుగుపరిచేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) చెప్పుకొచ్చారు. అంతర్జాతీయంగా టాప్ -100 వర్సిటీల్లో ఏపీ విశ్వవిద్యాలయాలను నిలపడానికి ప్రయత్నిస్తున్నామని. ఉన్నత విద్యావంతుడ్ని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా నియమించామని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కూడా అర్హత కలిగిన మంచి VC లను ఎంపిక చేసే పనిలో కమిటీలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని నాలెడ్జి సొసైటీ గా, నాలెడ్జి ఎకానమీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని.. ప్రభుత్వరంగం తో పాటు ప్రైవేటు రంగంలో పలు ప్రఖ్యాత విద్యాసంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని ఈ సందర్భంగా లోకేష్ విద్యార్థులతో చెప్పారు.