ఫేస్‌బుక్ ప్రేమ.. రైలు పట్టాలపై ఆత్మహత్య
చెన్నై: తిరుపుత్తూర్ జిల్లా ఆంబూర్ సమీపంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య అందరి మనస్సులను చలించివేసింది. ఫేస్‌బుక్ ద్వారా చిగురించిన వారి ప్రేమ రైలు పట్టాలపైన అంతమైంది. వివరాళ్లోకి వెళితే.. ఆంబూరు సమీపంలోని సామరసికుప్పంకు చెందిన రామదాస్ కూలీ పనిచేస్తూ బెంగళూరులో జీవనం సాగిస్తున్నాడు. అలాగే, పూంగులమ్‌పుదూర్‌కు చెందిన నందిని కోవైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది. అయితే, వీరు ఫేస్‌బుక్ ద్వారా కలుసుకున్నారు. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. ఊహించని విషయం ఏమిటంటే.. […]
చెన్నై: తిరుపుత్తూర్ జిల్లా ఆంబూర్ సమీపంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య అందరి మనస్సులను చలించివేసింది. ఫేస్‌బుక్ ద్వారా చిగురించిన వారి ప్రేమ రైలు పట్టాలపైన అంతమైంది. వివరాళ్లోకి వెళితే.. ఆంబూరు సమీపంలోని సామరసికుప్పంకు చెందిన రామదాస్ కూలీ పనిచేస్తూ బెంగళూరులో జీవనం సాగిస్తున్నాడు. అలాగే, పూంగులమ్‌పుదూర్‌కు చెందిన నందిని కోవైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది. అయితే, వీరు ఫేస్‌బుక్ ద్వారా కలుసుకున్నారు. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. ఊహించని విషయం ఏమిటంటే.. నందినికి ఏడాది క్రితమే వివాహం జరిగింది. భర్తకు దూరంగా ఒంటిరిగా నివసిస్తున్నట్లు రామదాస్‌కు తెలిసింది. దీంతో రామదాస్ ప్రియురాలి వద్దకు వెళ్లి ఓదార్చాడు. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ జంట ఆంబూర్‌లోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం కాస్తా రామదాసు కుటుంబీకులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ప్రేమికులిద్దరు వేరు వేరు వర్గాలకు చెందిన వారు కావడంతో.. ఆ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమికులు రైలు పట్టాలపై పడుకొని చివరిగా సెల్ఫీ తీసుకొని.. ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెళ్లి చేసుకున్న మూడో రోజే వీరు ఆత్మహత్య చేసుకోవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
tag:couples, suicide, facebook, chennai