దంపతుల ప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్.. అనాథలుగా మారిన పిల్లలు
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు దంపతులు బలయ్యారు. అప్పు తీర్చలేక భర్త ఆత్మహత్య చేసుకోగా.. భార్య కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరుకు చెందిన పి. శ్రీనివాసులు (40) కు బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన లక్ష్మీప్రసన్నతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీనివాసులు అత్తారింట్లోనే ఉంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. అయితే శ్రీనివాసులు క్రికెట్ బెట్టింగ్‌కు […]
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు దంపతులు బలయ్యారు. అప్పు తీర్చలేక భర్త ఆత్మహత్య చేసుకోగా.. భార్య కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరుకు చెందిన పి. శ్రీనివాసులు (40) కు బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన లక్ష్మీప్రసన్నతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీనివాసులు అత్తారింట్లోనే ఉంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. అయితే శ్రీనివాసులు క్రికెట్ బెట్టింగ్‌కు బానిసగా మారాడు. బెట్టింగులకు పోయి అప్పులపాలయ్యాడు. వాటిని కొంత మేర మామ చెల్లించినా.. ఇంకా రూ. లక్షలలోనే అప్పులున్నాయి.
ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ రాయుళ్ల నుంచి ఒత్తిడి ఎక్కువవ్వడంతో నెల్లూరు నగరంలోని ఎస్ 2 థియేటరు వద్దనున్న రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న ఆయన భార్య లక్ష్మీప్రసన్న విషం తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ లక్ష్మీప్రసన్న సోమవారం మృతి చెందింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బెట్టింగ్ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టిపెడుతున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌ల ఊబిలో కూరుకుపోయి కుటుంబాలను బలిచేయొద్దని హితవు పలికారు.