కపుల్ చాలెంజ్‌తో జాగ్రత్త!
దిశ, వెబ్‌డెస్క్: అన్నిటికన్నా వేగంగా వ్యాపించే వ్యసనం సిగరెట్ కాదు, ఆల్కహాల్ కాదు.. సోషల్ మీడియా. అవును.. మన జీవితం కంటే పక్కనోడి జీవితం మీద మనిషికి ఎక్కువ ఆసక్తి కాబట్టే, ఈ సోషల్ మీడియా ఇంత పాపులర్ అవుతోంది. ఎప్పుడూ ఒకడిని కాపీ కొట్టడమే తప్ప ఒరిజినాలిటీ లేని ఆన్‌లైన్ బతుకులుగా జీవితాలు మారిపోయాయి. అది కాకుండా అందరూ ఖాళీగా ఉన్నారు. చెప్పుకోదగ్గ పనిచేసే వాళ్లకంటే చిల్లరగా టైమ్‌పాస్ చేసే వాళ్లే ఎక్కువయ్యారు. అందుకే సోషల్ […]
దిశ, వెబ్‌డెస్క్:
అన్నిటికన్నా వేగంగా వ్యాపించే వ్యసనం సిగరెట్ కాదు, ఆల్కహాల్ కాదు.. సోషల్ మీడియా. అవును.. మన జీవితం కంటే పక్కనోడి జీవితం మీద మనిషికి ఎక్కువ ఆసక్తి కాబట్టే, ఈ సోషల్ మీడియా ఇంత పాపులర్ అవుతోంది. ఎప్పుడూ ఒకడిని కాపీ కొట్టడమే తప్ప ఒరిజినాలిటీ లేని ఆన్‌లైన్ బతుకులుగా జీవితాలు మారిపోయాయి. అది కాకుండా అందరూ ఖాళీగా ఉన్నారు. చెప్పుకోదగ్గ పనిచేసే వాళ్లకంటే చిల్లరగా టైమ్‌పాస్ చేసే వాళ్లే ఎక్కువయ్యారు. అందుకే సోషల్ మీడియాలో ఏ చిన్న చాలెంజ్ పుట్టినా అది విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక కారణం అంటూ లేకుండా ఏది పడితే అది చాలెంజ్‌గా మారుతోంది. కానీ ఆ చాలెంజ్ వల్ల జరిగే అనర్థాలను పట్టించుకోవడం లేదు. ఇంతకీ మనం మాట్లాడుతున్న చాలెంజ్ ఏంటి?
కపుల్ చాలెంజ్.. గత రెండు మూడు రోజులుగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చాలెంజ్‌లో తమ కపుల్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఊరికే పోస్ట్ చేస్తే పర్లేదు.. కానీ ఇతరుల కంటే భిన్నంగా ఉండాలన్న ప్రయత్నంలో కొందరు జంటలు అసభ్య ఫొటోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఫొటోల వల్ల ఉండే ప్రమాదాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. కపుల్ ఫొటోను మాడిఫై చేసి, తప్పుడుగా ఉపయోగించడానికి ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అంతేకాకుండా ఆ ఫొటోలను అడ్డంగా పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బెంగళూరులో ఇలాంటి ఒక సంఘటన జరిగింది కాబట్టి, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా మీద సమయాన్ని వృథా చేయడం మానేసి ఏదైనా ఉపయోగపడే పనిచేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.