ఈనెల 26 నుంచి తెలుగు విశ్వ విద్యాలయం కోర్సులలో ప్రవేశానికి కౌన్సెలింగ్

దిశ ప్రతినిధి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం యూజీ, పీజీ కోర్సులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలలో కనీస అర్హత పొందిన అభ్యర్థులకు ఈ నెల 26,27 తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రవేశాల కమిటీ సంచాలకుడు డాక్టర్ హన్మంతరావు మంగళవారం తెలిపారు. నాంపల్లిలోని యూనివర్శిటీలో నిర్వహించే కౌన్సెలింగ్ లో అర్హత పొందిన అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రిజర్వేషన్ కు సంబంధించిన పత్రాలను కూడా తమ వెంట తీసుకురావాలని సూచించారు. 26వ […]

Update: 2021-11-23 06:40 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం యూజీ, పీజీ కోర్సులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలలో కనీస అర్హత పొందిన అభ్యర్థులకు ఈ నెల 26,27 తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రవేశాల కమిటీ సంచాలకుడు డాక్టర్ హన్మంతరావు మంగళవారం తెలిపారు. నాంపల్లిలోని యూనివర్శిటీలో నిర్వహించే కౌన్సెలింగ్ లో అర్హత పొందిన అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రిజర్వేషన్ కు సంబంధించిన పత్రాలను కూడా తమ వెంట తీసుకురావాలని సూచించారు. 26వ తేదీన బీఎఫ్ఏ, ఎంఏ (జ్యోతిష్యం, హిస్టరీ, కల్చరల్, టూరిజం) కోర్సులకు, 27వ తేదీన ఎంఏ(తెలుగు, జర్నలిజం) కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు తెలుగు విశ్వ విద్యాలయం వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని డాక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు.

Tags:    

Similar News