బతుకమ్మ గొప్పతనాన్ని వాళ్లకు చెప్పాలి : ఉషారాణి
దిశ, గండిపేట్: రాబోయే తరాలకు బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నార్సింగి మున్సిపల్ కౌన్సిలర్ ఉషారాణి తెలిపారు. మంగళవారం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆమె అందరికీ పండుగ గొప్పతనాన్ని వివరించారు. ఈ మాట్లాడుతూ.. బతుకమ్మ ఉత్సవాలను సంతోషంగా నిర్వహించుకోవాలని అన్నారు. బతుకమ్మ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. అలాంటి మన సంస్కృతిని తరువాత తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వం నిర్దేశించిన నియమాలకు లోబడి ఉత్సవాల్లో […]
దిశ, గండిపేట్: రాబోయే తరాలకు బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నార్సింగి మున్సిపల్ కౌన్సిలర్ ఉషారాణి తెలిపారు. మంగళవారం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆమె అందరికీ పండుగ గొప్పతనాన్ని వివరించారు. ఈ మాట్లాడుతూ.. బతుకమ్మ ఉత్సవాలను సంతోషంగా నిర్వహించుకోవాలని అన్నారు. బతుకమ్మ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. అలాంటి మన సంస్కృతిని తరువాత తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వం నిర్దేశించిన నియమాలకు లోబడి ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. ఆ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.