షాకింగ్ న్యూస్.. ఆ కార్పొరేషన్‌లో అవినీతికి ఆర్డీఓనే నిదర్శనం

దిశ, పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి రాజ్యమేలుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పలువురు అధికారులపై వరుసగా అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జీ కమిషనర్‌గా ఉన్న పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ అవినీతి అధికారులకు పట్టుబడడమే నిదర్శనంగా చెప్పవచ్చు. పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ రామగుండం కార్పొరేషన్ కమిషనర్ ఇన్‌చార్జీగా విధులు నిర్వహిస్తుండగా రామగుండం కార్పొరేషన్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న రజినీకాంత్ పట్టణ ప్రగతి […]

Update: 2021-11-30 07:20 GMT

దిశ, పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి రాజ్యమేలుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పలువురు అధికారులపై వరుసగా అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జీ కమిషనర్‌గా ఉన్న పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ అవినీతి అధికారులకు పట్టుబడడమే నిదర్శనంగా చెప్పవచ్చు.

పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ రామగుండం కార్పొరేషన్ కమిషనర్ ఇన్‌చార్జీగా విధులు నిర్వహిస్తుండగా రామగుండం కార్పొరేషన్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న రజినీకాంత్ పట్టణ ప్రగతి హైడ్రోక్లోరైడ్ ద్రావణంకు సంబంధించిన బిల్లు రావాల్సి ఉండగా.. దాదాపు రూ. 9 లక్షల 25 వేల బిల్లును ఇప్పించాలని కోరారు. ఈ విషయంలో మధ్యవర్తి ద్వారా దాదాపు రూ. లక్ష రూపాయలు అడిగినట్లు సమాచారం.

దీంతో కాంట్రాక్టర్ రజినీకాంత్ ఏసీబీని ఆశ్రయించి మధ్యవర్తికి లక్ష రూపాయలు ఇస్తుండగా పట్టుకున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే రామగుండం స్క్రాప్ కుంభకోణంలో కూడా పెద్ద ఎత్తున చేతులు మారినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు సైతం పలువురు విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News