అక్టోబర్‌లోపు కరోనా డ్రగ్
న్యూయార్క్: కరోనా టీకా గురించే చర్చోపచర్చలు జరుగుతుండగా అమెరికా టాప్ అంటువ్యాధి నిపుణులు ఆంథోని ఫౌచి తీపి కబురు అందించారు. అక్టోబర్‌లోపు కరోనా డ్రగ్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నదని వెల్లడించారు. మోనోక్లోనల్ యాంటీబాడీ క్లినికల్ ట్రయల్ ఫలితాలు ఈ వ్యవధిలోపు వెలువడుతుందని అంచనా వేశారు. కరోనాకు చికిత్సకు సంబంధించి ప్రభుత్వ స్పందన వేగాన్ని బట్టి అక్టోబర్‌లోపు మందు రావొచ్చని తెలిపారు. మోనోక్లోనల్ యాంటీబాడీ ల్యాబ్‌లో ఉత్పత్తి చేసిన ప్రోటీన్. దీన్ని కరోనా పేషెంట్లకు ఇవ్వొచ్చు. కరోనా బారిన […]
న్యూయార్క్: కరోనా టీకా గురించే చర్చోపచర్చలు జరుగుతుండగా అమెరికా టాప్ అంటువ్యాధి నిపుణులు ఆంథోని ఫౌచి తీపి కబురు అందించారు. అక్టోబర్‌లోపు కరోనా డ్రగ్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నదని వెల్లడించారు. మోనోక్లోనల్ యాంటీబాడీ క్లినికల్ ట్రయల్ ఫలితాలు ఈ వ్యవధిలోపు వెలువడుతుందని అంచనా వేశారు. కరోనాకు చికిత్సకు సంబంధించి ప్రభుత్వ స్పందన వేగాన్ని బట్టి అక్టోబర్‌లోపు మందు రావొచ్చని తెలిపారు.
మోనోక్లోనల్ యాంటీబాడీ ల్యాబ్‌లో ఉత్పత్తి చేసిన ప్రోటీన్. దీన్ని కరోనా పేషెంట్లకు ఇవ్వొచ్చు. కరోనా బారిన పడిన పేషెంట్ల నుంచి సేకరించిన యాంటీబాడీల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తారు. ఇవి కరోనాకు సరైన జవాబిచ్చే బుల్లెట్లని అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్చియస్ డిసీజ్ డైరెక్టర్ ఆంథోని ఫౌచి ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌తో లైవ్ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మనకిప్పుడు తక్షణావసరం డ్రగ్స్. వీటిని కరోనా పేషెంట్లకు ఇచ్చి హాస్పిటల్ వెళ్లాల్సిన అవసరాన్ని నివారించవచ్చు. లేదా కరోనా ప్రభావిత సమయాన్ని వెంటనే తగ్గించవచ్చు’నని చెప్పారు. కరోనా రాకుండా వేసుకునే టీకా కంటే ప్రస్తుతం ఈ మహమ్మారితో బాధపడుతున్న కోట్లాది మందికి ప్రాణరక్షణగా నిలిచే డ్రగ్ త్వరలో వచ్చే అవకాశముందన్న వార్తపై హర్షం వ్యక్తమవుతున్నది.