ఆరు కరోనా మరణాలు.. 341 కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. శుక్ర, శనివారాల్లో సుమారు సరాసరిగా 60 కొత్త కేసులు చొప్పున నమోదయ్యాయి. ఆదివారం మధ్యాహ్నానికి దేశంలో కరోనా కేసులు 341కి పెరిగాయి. కాగా, కరోనా మరణాలు ఆరుకు చేరాయి. ఆదివారం ఒక్కరోజే రెండు మరణాలు సంభవించడం ఆందోళనకరం. మహారాష్ట్రలో 63ఏళ్ల వృద్ధుడు హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో మృతి చెందాడు. బిహార్‌లో మొదటి కరోనా వైరస్ సంబంధిత మరణం చోటుచేసుకుంది. బీహార్‌లో కరోనాబారిన పడిన 38ఏళ్ల వ్యక్తి కిడ్నీ […]
న్యూఢిల్లీ : దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. శుక్ర, శనివారాల్లో సుమారు సరాసరిగా 60 కొత్త కేసులు చొప్పున నమోదయ్యాయి. ఆదివారం మధ్యాహ్నానికి దేశంలో కరోనా కేసులు 341కి పెరిగాయి. కాగా, కరోనా మరణాలు ఆరుకు చేరాయి. ఆదివారం ఒక్కరోజే రెండు మరణాలు సంభవించడం ఆందోళనకరం. మహారాష్ట్రలో 63ఏళ్ల వృద్ధుడు హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో మృతి చెందాడు. బిహార్‌లో మొదటి కరోనా వైరస్ సంబంధిత మరణం చోటుచేసుకుంది. బీహార్‌లో కరోనాబారిన పడిన 38ఏళ్ల వ్యక్తి కిడ్నీ ఫెయిల్యూర్‌తో ప్రాణాలొదిలాడు. ఆదివారం మధ్యాహ్నానికి దేశంలో మొత్తంగా 341 కరోనా కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.
Tags: coronavirus, death toll, casualties, ICMR, 341