హైదరాబాద్ లో క్లినికల్ ట్రయల్స్

కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలు పోటాపోటీగా విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి. ఏ దేశం ముందు వ్యాక్సిన్ తయారు చేస్తే ఆ దేశానికే వరల్డ్ వైజ్ గా గుర్తింపు లభించనుంది. ఈ నేపథ్యంలోనే చిన్నదేశం నుంచి పెద్ద కంట్రీల వరకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ రేసులో భారతదేశం ముందడుగు వేస్తోంది. ఇండియాకు చెందిన భారత్ బయోటిక్ కంపెనీ వ్యాక్సిన్ తయారిలో ముందజలో ఉన్నది. ఈ కంపెనీ ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)‌తో కలిసి ఈ […]

Update: 2020-07-07 06:03 GMT

కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలు పోటాపోటీగా విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి. ఏ దేశం ముందు వ్యాక్సిన్ తయారు చేస్తే ఆ దేశానికే వరల్డ్ వైజ్ గా గుర్తింపు లభించనుంది. ఈ నేపథ్యంలోనే చిన్నదేశం నుంచి పెద్ద కంట్రీల వరకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ రేసులో భారతదేశం ముందడుగు వేస్తోంది. ఇండియాకు చెందిన భారత్ బయోటిక్ కంపెనీ వ్యాక్సిన్ తయారిలో ముందజలో ఉన్నది.

ఈ కంపెనీ ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)‌తో కలిసి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కోవాగ్జిన్‌కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభించనుంది. ఆరోగ్యవంతులైన 60 మంది వ్యక్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. క్లినికల్ ట్రయల్స్‌కు అంగీకరించిన వ్యక్తుల నుంచి రక్త నమూనాలు నిమ్స్ వైద్యులు సేకరించనున్నారు.

ట్రాయల్స్ కు ముందుకు వచ్చిన వారి రక్త నమూనాలు పరిశీలించి, వారిలో ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించిన వారికి మాత్రమే వాక్సిన్ డోస్ ఇవ్వనున్నారు. ట్రయల్స్ లో భాగంగా ఒక్కో వ్యక్తికి మూడు డోసులు ఇస్తారు. మొదటి డోస్‌ ఇచ్చిన తర్వాత ఆస్పత్రిలోనే రెండ్రోజులు పర్యవేక్షణలో వారిని ఉంచుతారు. అనంతరం 14 రోజుల తర్వాత రెండో డోస్‌ ఇస్తారు. వ్యాక్సిన్ తయారీలో క్లినికల్ ట్రయల్స్ కీలక దశగా వైద్యనిపుణులు చెబుతుంటారు.

Tags:    

Similar News