1024 కరోనా కేసులు.. 27 మరణాలు

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య, మరణాలు పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1024కు చేరుకుంది. ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. 96 మందికి నయం కావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అత్యధికంగా మహారాష్ట్రలో 186, కేరళ‌లో 182 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా మణిపూర్, మిజోరం, పుదుచ్చేరిల్లో ఒక్కో కేసు నమోదైంది. కేసుల పెరుగుదల దృష్ట్యా 21 రోజుల లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర […]

Update: 2020-03-29 10:32 GMT

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య, మరణాలు పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1024కు చేరుకుంది. ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. 96 మందికి నయం కావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అత్యధికంగా మహారాష్ట్రలో 186, కేరళ‌లో 182 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా మణిపూర్, మిజోరం, పుదుచ్చేరిల్లో ఒక్కో కేసు నమోదైంది. కేసుల పెరుగుదల దృష్ట్యా 21 రోజుల లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. లక్షల మంది వలస కార్మికులు ఆయా రాష్ట్రాల సరిహద్దులు దాటకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర సరిహద్దులతోపాటు జిల్లాల సరిహద్దులను కూడా మూసివేయాలని ఆదేశించింది.

Tags: Coronavirus, Cases ,India ,Cross 1,000-Mark, 27 Dead

Tags:    

Similar News