శుభవార్త.. కరోనా తొలి బాధితుడు డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. 12 రోజులు సుదీర్ఘ చికిత్స, పర్యవేక్షణతో బతికి బట్టకట్టాడు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో బాధితుడు ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం విశాఖ వాసుల్ని ఆనందంలో ముంచెత్తింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… ఈ నెల 17న విశాఖపట్టణంలోని అల్లిపురంలో తొలి కరోనా వైరస్ కేసు బయటపడింది. 65 ఏళ్ల వ్యక్తి ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం మదీనాకు వెళ్లి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. 12 రోజులు సుదీర్ఘ చికిత్స, పర్యవేక్షణతో బతికి బట్టకట్టాడు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో బాధితుడు ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం విశాఖ వాసుల్ని ఆనందంలో ముంచెత్తింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే…
ఈ నెల 17న విశాఖపట్టణంలోని అల్లిపురంలో తొలి కరోనా వైరస్ కేసు బయటపడింది. 65 ఏళ్ల వ్యక్తి ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం మదీనాకు వెళ్లి వచ్చాడు. అనంతరం హైదరాబాదులోని కుమార్తె ఇంటికి వెళ్లి, మరుసటి రోజు అక్కడి నుంచి ట్రైన్‌లో విశాఖపట్టణం వచ్చాడు. అనంతరం ఇంటికి వచ్చిన వారందర్నీ కలిశాడు. దగ్గర్లోని మసీదు ప్రార్థనల్లో పాల్గొన్నాడు. అనంతరం దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఈ నెల 17న విశాఖలోని టీబీసీడీ ఆసుపత్రిలో చేరాడు. బీపీ, డయాబెటీస్ ఉన్నప్పటికి చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడింది.
65 ఏళ్ల వయసు వ్యక్తి కావడంతో పాటు, డయాబెటిక్ పేషంట్ కావడంతో అతనిని రక్షించడం కష్టమని భావించారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అతను కోలుకున్నాడు. నిన్న, ఈ రోజు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో అతనిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని 14 రోజులు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించారు. కరోనా తగ్గినప్పటికీ డెడ్ సెల్స్ పుంజుకునే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కాగా, ఆయన భార్య కోలుకోవాల్సి ఉంది.
Tags : visakhapatnam, corona positive, covid-19, tb hospital, 65 years corona patient,