మలమూత్ర విసర్జనలోనూ మహమ్మారి!
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి రోజుకో రకంగా వినిపిస్తోంది. మొన్న వెక్కిళ్లు కూడా కరోనా లక్షణమన్నారు. నిన్న జుట్టు ఊడిపోవడం కూడా అదేనన్నారు. బహిర్గతంలో అనేక కోణాలను చూపిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వారి ముక్కు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బహిర్గతమవుతుందని తేలింది. దీని మురుగు నీటి పరీక్షల ద్వారా వివిధ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నిర్ధారించొచ్చునని సీసీఎంబీ బుధవారం ప్రకటించింది. ఐతే మురుగునీట్లో చేరిన […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి రోజుకో రకంగా వినిపిస్తోంది. మొన్న వెక్కిళ్లు కూడా కరోనా లక్షణమన్నారు. నిన్న జుట్టు ఊడిపోవడం కూడా అదేనన్నారు. బహిర్గతంలో అనేక కోణాలను చూపిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వారి ముక్కు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బహిర్గతమవుతుందని తేలింది.
దీని మురుగు నీటి పరీక్షల ద్వారా వివిధ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నిర్ధారించొచ్చునని సీసీఎంబీ బుధవారం ప్రకటించింది. ఐతే మురుగునీట్లో చేరిన వైరస్ రోగ కారకం కాదంటున్నారు. దీన్ని సంక్రమిత రోగాలను అర్ధం చేసుకోవడానికి వీలవుతుందని ప్రకటించింది. మహమ్మారిని నియంత్రించడానికి వ్యాధి వ్యాప్తిని గుర్తించడమే ప్రధానమైన ప్రక్రియ. ఈ వ్యాధి సోకిన వారి విసర్జితాలు సుమారు 35 రోజుల వరకు వైరస్ పదార్ధాలతో నిండి ఉంటుంది. అంటే వైరస్ పదార్ధాలతోనే విసర్జిస్తారు.
హైదరాబాద్ మహానగరంలో ఉపయోగిస్తోన్న 1800 మిలియనన్ల నీటిలో 40 శాతం వివిధ మురుగు నీటిని శుభ్రం చేసే కేంద్రాల్లో శుభ్రం చేస్తున్నారు. సీఎస్ఐఆర్-సీసీఎంబీ, సీఎస్ఐఆర్- ఐఐసీటీలు జరిపిన సంయుక్త పరిశోధనల ద్వారా నగరంలో వ్యాధి సోకిన వారి సంఖ్యను గుర్తించారు. విసర్జిత పదార్ధాలపై సీసీఎంబీ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఐఐసీటీ నుంచి మనుపాటి హేమలత, హరిశంకర్, వెంకటమోహన్, సీసీఎంబీ నుంచి ఉదయ్ కిరణ్, కుంచా సంతోష్ కుమార్, రాకేశ్ మిశ్రాలు పాల్గొన్నారు.
వీరి ప్రయోగాల నుంచి ఒక నెల రోజుల్లో జరిగిన వ్యాప్తిని గుర్తించారు. ప్రధానంగా మురుగునీటిని శుభ్రపరిచే కేంద్రాల నుంచి కరోనా వైరస్ ను గుర్తించి పరీక్షించారు. ఐతే అవి వ్యాధిని కలగజేయలేవని స్పష్టం చేశారు. మురుగునీటి ప్రవేశ ద్వారాల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్ లను గుర్తించారు. ప్లాంట్ల నుంచి బహిర్గతమవుతున్న నీటిలో వైరస్ ఏమీ లేదు. దీని వల్ల ప్లాంట్లు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని నిర్ధారించారు.
80 శాతం మురుగు కేంద్రాల్లో పరీక్షలు
సీసీఎంబీ, ఐఐసీటీ శాస్త్రవేత్తలు నగరంలోని 80 శాతం మురుగునీటి కేంద్రాల్లో సేకరించిన నీటిని పరీక్షించారు. పరిశీలన, పరిశోధనల ఆధారండగా సుమారు 2 లక్షల మంది విసర్జితాల్లో వైరస్ విడుదలైనట్లు నిర్ధారించారు. కేవలం 40 శాతం మురుగునీరు మాత్రమే శుద్ధి కేంద్రాలకు వస్తోంది. దీని ప్రకారం అంచనా వేసి 6.60 లక్షల మందికి కరోనా సోకిందని, గడిచిన 35 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చినట్లు లెక్క తేల్చారు.
సంప్రదాయ పద్ధతిలో లెక్కల ప్రకారమే సుమారు 2.60 లక్షల మంది కరోనా వ్యాధిగ్రస్థులు ఉన్నట్లు అర్ధమవుతోందని సీసీఎంబీ ప్రకటించింది. ఈ పరిశోధనలను మెడ్ రెక్సివ్ అనే ముందస్తు ప్రచురణలు చేసిన సర్వేలో పొందుపరిచారు. ఈ పరిశోధన ప్రకారం చాలా మంది కరోనా వ్యాధి లక్షణాలు లేని వారు ఆసుపత్రిలో చేరడం అవసరం లేదని తెలుస్తుందని ప్రకటించింది. ఈ సమయంలో రోగగ్రస్థులు, ఆసుపత్రికి పాలైన వారు, మరణించిన వారి గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
మెరుగైన ఆరోగ్య వ్యవస్థలు
ఇక్కడి మన ఆరోగ్య వ్యవస్థలు కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా సమర్ధవంతంగా పని చేస్తున్నాయి. పౌర సంస్థల సహకారంతో ఈ వ్యాధి తీవ్రతను ఉన్న ప్రాంతాలను గుర్తించడమే కాకుండా, నిరోధించేందుకు సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని సీసీఎంబీ నిర్దేశకులు డా.రాకేశ్ మిశ్రా తెలిపారు.