బ్రిటన్‌లో మొదలైన థర్డ్ వేవ్..
దిశ, వెబ్ డెస్క్ : బ్రిటన్‌లో థర్డ్ వేవ్ ప్రారభమైన సంకేతాలు కనిపిస్తున్నాయని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి గుప్తా హెచ్చరించారు. భారత్ పై కరోనా సెకండ్ వేవ్ తీవ్రమైన ప్రభావం చూపిందని ఇప్పుడు వస్తున్న కొత్తకేసుల్లో నాలుగింట మూడొవంతు భారత్‌లో బయటపడిన బి.1.617 రకానివేనని తెలిపారు. అదేవిధంగా బ్రిటన్‌లో రోజువారి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్న మునుముందు కేసుల సంఖ్య పెరిగి, పరిస్థితి తీవ్రంగా మారే ముప్పు ఉందని ఆందోళన […]
దిశ, వెబ్ డెస్క్ : బ్రిటన్‌లో థర్డ్ వేవ్ ప్రారభమైన సంకేతాలు కనిపిస్తున్నాయని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి గుప్తా హెచ్చరించారు. భారత్ పై కరోనా సెకండ్ వేవ్ తీవ్రమైన ప్రభావం చూపిందని ఇప్పుడు వస్తున్న కొత్తకేసుల్లో నాలుగింట మూడొవంతు భారత్‌లో బయటపడిన బి.1.617 రకానివేనని తెలిపారు. అదేవిధంగా బ్రిటన్‌లో రోజువారి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్న మునుముందు కేసుల సంఖ్య పెరిగి, పరిస్థితి తీవ్రంగా మారే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 21 నుంచి తిరిగి అన్ని కార్యకలాపాలను అనుమతించి, మునుపటి స్థితికి తీసుకురావాలని బ్రిటన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అలాంటి ఆలోచనను పక్కనపెట్టాలని ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ప్రొఫెసర్ రవిగుప్తా కోరారు.