ఏనుగులకు కరోనా టెస్టులు
చెన్నై: కరోనా మహమ్మారి జంతువుల్లోనూ వెలుగుచూసి కలకలం రేపుతున్నది. తమిళనాడులోని ఓ జూ పార్కులో సింహం కరోనాతో మరణించడం, మరో తొమ్మిది సింహాల్లో కరోనా పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోయంబత్తూర్, నిలగిరీ జిల్లాల్లోని రెండు క్యాంపుల్లో 56 ఏనుగులకు కరోనా పరీక్షలు చేయడానికి శాంపిళ్లు సేకరించారు. కోయంబత్తూర్ జిల్లా కోజిక్‌ముడి క్యాంప్‌లో 28 ఏనుగులకు నిర్వహించిన పరీక్షలను స్వయంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి కే రామచంద్రన్ పర్యవేక్షించారు. ఇందులో 18 మగ, 10 ఆడ […]
చెన్నై: కరోనా మహమ్మారి జంతువుల్లోనూ వెలుగుచూసి కలకలం రేపుతున్నది. తమిళనాడులోని ఓ జూ పార్కులో సింహం కరోనాతో మరణించడం, మరో తొమ్మిది సింహాల్లో కరోనా పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోయంబత్తూర్, నిలగిరీ జిల్లాల్లోని రెండు క్యాంపుల్లో 56 ఏనుగులకు కరోనా పరీక్షలు చేయడానికి శాంపిళ్లు సేకరించారు. కోయంబత్తూర్ జిల్లా కోజిక్‌ముడి క్యాంప్‌లో 28 ఏనుగులకు నిర్వహించిన పరీక్షలను స్వయంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి కే రామచంద్రన్ పర్యవేక్షించారు. ఇందులో 18 మగ, 10 ఆడ ఏనుగులున్నాయి. కాగా, అదే క్యాంపులోని 60 మంది మావటీలు, సహాయకులు, వాళ్ల కుటుంబ సభ్యులకు ముందు జాగ్రత్తగా టీకా వేశారు. నీలగిరి జిల్లా తెప్పకాడు క్యాంపులోని 28 ఏనుగుల నుంచీ శాంపిల్స్ తీసుకున్నారు. అన్ని ఏనుగుల నుంచి తీసుకున్న నమూనాలను యూపీలో ఇజాత్‌నగర్‌లోని ఇండియన్ వెటరినరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపాలని మంత్రి ఆదేశించారు.