ఒక్కొక్కరిని కాదు.. ఒకేసారి 406 మందిని పంపించు!

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నిబంధనలు పాటించకపోతే ఎంత ప్రమాదకరమో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. పలు యూనివర్సిటీల అధ్యయనం తర్వాత ఆయన ఓ నివేదికను రూపొందించి ప్రకటన చేశారు. కొవిడ్ వచ్చిన వ్యక్తి కరోనా నిబంధనలు పాటించితే అతడి వల్ల 30 రోజుల్లో కేవలం 15 మందికి మాత్రమే వైరస్ సోకే ప్రమాదం ఉన్నదని ఆ నివేదికలో వెల్లడించారు. అదే కరోనా రోగి నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తే […]

Update: 2021-04-27 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నిబంధనలు పాటించకపోతే ఎంత ప్రమాదకరమో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. పలు యూనివర్సిటీల అధ్యయనం తర్వాత ఆయన ఓ నివేదికను రూపొందించి ప్రకటన చేశారు. కొవిడ్ వచ్చిన వ్యక్తి కరోనా నిబంధనలు పాటించితే అతడి వల్ల 30 రోజుల్లో కేవలం 15 మందికి మాత్రమే వైరస్ సోకే ప్రమాదం ఉన్నదని ఆ నివేదికలో వెల్లడించారు.

అదే కరోనా రోగి నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తే 30 రోజుల్లో 406 మందికి కొవిడ్-19 వైరస్ ప్రభలుతుందని లవ్ అగర్వాల్ వివరించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కరోనాను నిరోధించేందుకు అత్యవసరమని నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటివరకూ కరోనాపై జరిగిన అధ్యయనాలన్నీ ఇదే సూచిస్తున్నాయని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటించడంతో వ్యాప్తి తీవ్రత తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News