అక్కడికి వెళ్లొచ్చిన ఆ పెద్దలెవరు?
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక మతపెద్ద కరోనా పాజిటివ్ బారిన పడడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీకి వెళ్లి వచ్చి సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో ఆయనతోపాటు, మరో ఇద్దరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యక్తి నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ తిరిగాడని ప్రచారం జరుగుతోంది. అదే క్రమంలో ఆ వ్యక్తి అనేక మంది ప్రముఖులను కూడా కలిశాడని చెబుతున్నారు. కేంద్ర నిఘా వర్గాలు […]
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక మతపెద్ద కరోనా పాజిటివ్ బారిన పడడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీకి వెళ్లి వచ్చి సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో ఆయనతోపాటు, మరో ఇద్దరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యక్తి నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ తిరిగాడని ప్రచారం జరుగుతోంది. అదే క్రమంలో ఆ వ్యక్తి అనేక మంది ప్రముఖులను కూడా కలిశాడని చెబుతున్నారు. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం తర్వాత ఆయనను అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహించే దాకా ఆయనకు పాజిటివ్ వచ్చిన విషయం ఎవరికీ తెలియదు. అంతకుముందే ఆ వ్యక్తి స్థానికులతో కలిసి పలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినట్లు ప్రచారం జరుగుతున్నది. జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో కలిసి పలు సమస్యలపై మాట్లాడారని, కరోనా బారిన పడ్డ వారికి సహకారం కూడా అందించారని చెబుతున్నారు. అధికారులతో పాటు జిల్లాకు చెందిన కొందరు అధికార పార్టీ నేతలను ఆయన కలిశాడని జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతున్నది.
కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి… ఇతరులతో కలిసి నిత్యావసరాలు, ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో జిల్లా అధికార, రాజకీయ ప్రముఖులు పాల్గొనడం చర్చనీయాంశం అవుతుంది. ఆ పెద్దలు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి వారి సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. అయితే కొద్ది రోజులు పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కలిసి తిరిగిన ఆరుగురిని ఇప్పటికే క్వారంటైన్‌కు పంపడం చర్చనీయాంశం అవుతున్నది. వీరితోపాటు కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు పంపాల్సిన అవసరం ఏర్పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షల అనంతరం రిపోర్టులు నెగిటివ్ వస్తే మంచిదే… లేనిపక్షంలో ఈ చైన్ ఎటు లాగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
అధికారుల వద్ద ప్రముఖుల చిట్టా… ఆందోళన!
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కలిసిన ప్రముఖులు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వారిద్దరి నుంచి ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తుల సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖుల చిట్టా కూడా ఉన్నట్లు సమాచారం. వారిని కూడా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య శాఖ అధికారులు సలహాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై అన్ని వర్గాల్లో ఆందోళన చెలరేగుతోంది.
tags: coronavirus, positive, intelligence, political figures, adilabad, nirmal district, lockdown