కేజీబీవీ స్కూల్‌లో కరోనా కలకలం.. ఇద్దరు విద్యార్థినిలకు పాజిటివ్
దిశ, నిర్మల్ కల్చరల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్‌లో కొనసాగుతున్న సోన్ మండల కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినిలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్ లక్షణాలు కనిపించడంతో పాఠశాల సిబ్బంది శనివారం రాత్రి పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో వారి తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులను వారికి అప్పగించారు. మిగతా విద్యార్థినిలకు, ఉపాధ్యాయినిలకు, అందులో పనిచేసే సిబ్బందికి పరీక్షలు చేయడంతో అందరికీ నెగెటివ్ అని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. […]
దిశ, నిర్మల్ కల్చరల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్‌లో కొనసాగుతున్న సోన్ మండల కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినిలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్ లక్షణాలు కనిపించడంతో పాఠశాల సిబ్బంది శనివారం రాత్రి పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో వారి తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులను వారికి అప్పగించారు.
మిగతా విద్యార్థినిలకు, ఉపాధ్యాయినిలకు, అందులో పనిచేసే సిబ్బందికి పరీక్షలు చేయడంతో అందరికీ నెగెటివ్ అని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాలను యథావిధిగా నడిపించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఎస్ఏ-1 పరీక్షలు కొనసాగుతున్నందున విద్యార్థినిలందరూ కరోనా నిబంధనలు పాటించాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు.