మల్లంపల్లి పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు పాజిటివ్

దిశ, ములుగు: మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో కరోనా అనుమానిత లక్షణాలతో కనిపించిన వారికి మంగళవారం టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ముగ్గురు ఉపాధ్యాయులకు పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మరో ఇద్దరు ఉపాధ్యాయులు కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై ‘దిశ’ రిపోర్టర్ ములుగు వైద్యాధికారి అప్పయ్యను వివరణ […]

Update: 2021-09-07 05:09 GMT

దిశ, ములుగు: మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో కరోనా అనుమానిత లక్షణాలతో కనిపించిన వారికి మంగళవారం టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ముగ్గురు ఉపాధ్యాయులకు పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మరో ఇద్దరు ఉపాధ్యాయులు కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై ‘దిశ’ రిపోర్టర్ ములుగు వైద్యాధికారి అప్పయ్యను వివరణ కోరగా, ఉపాధ్యాయులకు పాజిటివ్ వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. దీంతో పాఠశాలలోని విద్యార్థులతో పాటు మిగతా టీచర్లకు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించేందుకు మల్లంపల్లి పాఠశాలకు వైద్య బృందాన్ని పంపిస్తున్నట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు, గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని, పాజిటివ్ వచ్చిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్సలు చేస్తామని అన్నారు.

Tags:    

Similar News