ఆ నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్..

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మనుషులనే కాదు.. జంతువులను కూడా వదలట్లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మానవ మననుగడనే ప్రశ్నార్థకం చేసిన మహమ్మారి ప్రస్తుతం మూగజీవాలపై తమ ప్రతాపం చూపుతోంది. తాజాగా స్పానిష్ జూపార్క్‌లోని నాలుగు సింహాలకు కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు జూ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. బార్సిలోనా జూపార్క్‌లోకి నిత్యం సందర్శకులు వస్తుండటంతో అందులోని నాలుగు సింహాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో వాటికి పాజిటివ్‌గా ఉన్నట్టు తేలిందని పశు […]

Update: 2020-12-09 22:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మనుషులనే కాదు.. జంతువులను కూడా వదలట్లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మానవ మననుగడనే ప్రశ్నార్థకం చేసిన మహమ్మారి ప్రస్తుతం మూగజీవాలపై తమ ప్రతాపం చూపుతోంది. తాజాగా స్పానిష్ జూపార్క్‌లోని నాలుగు సింహాలకు కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు జూ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. బార్సిలోనా జూపార్క్‌లోకి నిత్యం సందర్శకులు వస్తుండటంతో అందులోని నాలుగు సింహాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో వాటికి పాజిటివ్‌గా ఉన్నట్టు తేలిందని పశు వైద్యాధికారులు తెలిపారు. సింహాలలో స్వల్ప లక్షణాలు కనిపించాయని సిబ్బంది వెల్లడించారు. దీంతో సింహాలకు కరోనా సోకడంతో జూపార్కులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో జూపార్కు ఉద్యోగుల్లో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. సింహాలకు జూ సిబ్బంది ద్వారానే కరోనా సోకిందనట్లు అధికారులు తేల్చారు.

Tags:    

Similar News