పూణెలోని ఐటీ ఉద్యోగులకు కరోనా

పుణెలోని తమ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్టు ప్రముఖ ఐటీ సంస్థలు డెల్ ఇండియా, మైండ్‌ట్రీ కంపెనీలు ప్రకటించాయి. వీరిని క్వారేంటైన్ చేసి, మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపాయి. డెల్ ఉద్యోగి అమెరికాలోని టెక్సాస్ నుంచి రాగా, మైండ్ ట్రీ ఉద్యోగి కూడా విదేశాలకు వెళ్లి వచ్చారు. దీంతో వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో పాజిటివ్‌గా తేలింది. వెంటనే అప్రమత్తమైన కంపెనీలు వారికి అత్యుత్తమ వైద్య సాయం అందిస్తున్నాయి. కాగా, యాక్సెంచర్ సంస్థ పూణె కార్యాలంలోని […]

Update: 2020-03-11 20:38 GMT

పుణెలోని తమ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్టు ప్రముఖ ఐటీ సంస్థలు డెల్ ఇండియా, మైండ్‌ట్రీ కంపెనీలు ప్రకటించాయి. వీరిని క్వారేంటైన్ చేసి, మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపాయి. డెల్ ఉద్యోగి అమెరికాలోని టెక్సాస్ నుంచి రాగా, మైండ్ ట్రీ ఉద్యోగి కూడా విదేశాలకు వెళ్లి వచ్చారు. దీంతో వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో పాజిటివ్‌గా తేలింది. వెంటనే అప్రమత్తమైన కంపెనీలు వారికి అత్యుత్తమ వైద్య సాయం అందిస్తున్నాయి. కాగా, యాక్సెంచర్ సంస్థ పూణె కార్యాలంలోని ఒక అంతస్తును తాత్కాలికంగా మూసివేసింది.

tag; coronavirus, it companies, dell, mindtree, pune

Tags:    

Similar News