ఏపీలో 8లక్షల 25వేలు దాటిన కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 88,780 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,618 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,25,966కు చేరింది. 16మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 6,706గా ఉంది. ప్రస్తుతం 23,668యాక్టివ్‌ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 7.95లక్షల మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 3,509 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 81.17లక్షల మందికి కరోనా పరీక్షలు […]

Update: 2020-11-01 06:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 88,780 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,618 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,25,966కు చేరింది. 16మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 6,706గా ఉంది. ప్రస్తుతం 23,668యాక్టివ్‌ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 7.95లక్షల మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 3,509 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 81.17లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, విశాఖలో ఒకరు చొప్పున చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 123పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 423, తూర్పుగోదావరిలో 291, గుంటూరులో 387, కడపలో 125, కృష్ణా జిల్లాలో 328, కర్నూలులో 40, నెల్లూరులో 96, ప్రకాశంలో 255, శ్రీకాకుళంలో 95, విశాఖపట్నం 85, విజయనగరం 74, పశ్చిమగోదావరిలో 296 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News