నిర్మల్ జిల్లాను కరోనా ‘ఫ్రీ’ చేద్దాం : ఎస్పీ శశిధర్ రాజు
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాను కరోనా ఫ్రీగా మార్చేందుకు ప్రజలందరూ తమవంతు సహకారం అందించాలని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. శనివారం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేటెడ్ వార్డు, పాలిటెక్నిక్ క్వారంటైన్ హోమ్, సోఫినగర్ క్వారంటైన్ హోమ్‌లను ఆయన సందర్శించారు. రోజువారీ విధుల్లో ఉంటున్న పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలన్నారు. మర్కజ్ ప్రార్థనల కోసం ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించామన్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో పట్టణంలో ఎవరూ […]
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాను కరోనా ఫ్రీగా మార్చేందుకు ప్రజలందరూ తమవంతు సహకారం అందించాలని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. శనివారం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేటెడ్ వార్డు, పాలిటెక్నిక్ క్వారంటైన్ హోమ్, సోఫినగర్ క్వారంటైన్ హోమ్‌లను ఆయన సందర్శించారు. రోజువారీ విధుల్లో ఉంటున్న పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలన్నారు. మర్కజ్ ప్రార్థనల కోసం ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించామన్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో పట్టణంలో ఎవరూ బైకు,వాహనాల్లో బయటకు రావొద్దన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
Tags: corona, lockdown, nirmal, sp shashidhar