నిజామాబాద్‌లో టెన్షన్.. టెన్షన్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులు కరోనా బారిన పడడంతో ఆ శాఖ ఉన్నతాధికారుల్లో ఆందోళన నెలకొంది. గత వారం నలుగురు.. తాజాగా 11 మంది శిక్షణ కానిస్టేబుళ్లకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో టెన్షన్ నెలకొంది. ట్రైనింగ్ సెంటర్లో ప్రస్తుతం 220 మంది శిక్షణ తీసుకుంటుండగా వారిలో 15 మంది కొవిడ్–19 బారిన పడ్డారు. దీంతో వారితో ప్రైమరీ కాంట్రాక్ట్ లో ఉన్నవారిని […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులు కరోనా బారిన పడడంతో ఆ శాఖ ఉన్నతాధికారుల్లో ఆందోళన నెలకొంది. గత వారం నలుగురు.. తాజాగా 11 మంది శిక్షణ కానిస్టేబుళ్లకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో టెన్షన్ నెలకొంది. ట్రైనింగ్ సెంటర్లో ప్రస్తుతం 220 మంది శిక్షణ తీసుకుంటుండగా వారిలో 15 మంది కొవిడ్–19 బారిన పడ్డారు. దీంతో వారితో ప్రైమరీ కాంట్రాక్ట్ లో ఉన్నవారిని గుర్తించి హోం ఐసోలేషన్ లో ఉంచేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో కరోనా కలకలం రేపుతుంది. గత వారం నలుగురికి పాజిటివ్ రాగా, మంగళవారం 11 మంది కానిస్టేబుళ్లు వైరస్ బా రిన పడ్డారు. దీంతో అక్కడ శిక్షణ పొందుతున్న వారిలో ఆందోళన నెలకొంది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ వద్ద పోలీస్ శిక్షణ కేంద్రంలో ప్రతీ సంవత్సరం కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన ఇతర జిల్లాకు చెందిన వారికి శిక్షణ ఇస్తుంటారు. ప్రస్తుతం 2019-20 సైబారాబాద్ జోన్ బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్స్ శిక్షణ తీసుకుంటున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో అన్‌లాక్ –1లో పీటీసీ పై వైరస్ ప్రభావం పడలేదు. అన్ లాక్ –2 చివరి రోజుల్లో శిక్షణ తీసుకుంటున్న నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
తాజాగా కొవిడ్ లక్షణాలు ఉన్నాయని అనుమానంతో 11 మంది కానిస్టేబుళ్లు జనరల్ ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేసుకోగా వారికి పాజిటివ్ అని తేలింది. మొదట నలుగురికి పాజిటివ్ వచ్చిన తరువాత పీటీసీ మొత్తాన్ని సోడియం హైపోక్లోరేట్ ద్రావణంతో పిచికారీ చేయించ డం, అందరికీ శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరో 11 మంది వైరస్ బారిన పడడంతో పోలీస్ అధికారుల్లో గుబులు రే పుతోంది. పోలీస్ శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం 220 మంది శిక్షణ తీసుకుంటుండ గా వారిలో 15 మంది వైరస్ బా రిన పడ్డారు. దీంతో వారితో ప్రైమరీ కాంట్రాక్ట్ ఉన్నవారిని గుర్తించి హోం ఐసోలేషన్ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైరస్ నియంత్రణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోరాడుతున్న పోలీసులు సైతం వైరస్‌బారిన పడి త్వరగానే కోలుకున్నారు. జిల్లాలో ఓ ఎఆర్ ఎస్ఐ, ఒక హోం గార్డు మాత్రమే కొవిడ్19 బారిన పడి చికిత్స పొం దుతూ చనిపోయారు. కాగా, పీటీసీలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శిక్షణ తరగతుల నిర్వహణపై ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ శ్రావణ్ కుమార్ తెలిపారు.