కరోనా ఎఫెక్ట్ : ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లు రద్దు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 దేశాల్లో 86,927 మందికి కొవిడ్-19 (కరోనా వైరస్) సోకగా..2,976 మంది మృతి చెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండగా.. ప్రస్తుతం ఈ ప్రభావం ఇంగ్లాండ్‌లో ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లపైనా పడి, వారాంతంలో నిర్వహించే పలు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఈ మేరకు స్విస్ సూపర్ లీగ్‌తో పాటు సిరీస్ ఏ మ్యాచ్‌లను యూరోప్‌లో రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంగ్లాండ్‌లో మ్యాచ్‌లను పూర్తి స్థాయిలో […]
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 దేశాల్లో 86,927 మందికి కొవిడ్-19 (కరోనా వైరస్) సోకగా..2,976 మంది మృతి చెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండగా.. ప్రస్తుతం ఈ ప్రభావం ఇంగ్లాండ్‌లో ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లపైనా పడి, వారాంతంలో నిర్వహించే పలు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు రద్దయ్యాయి.
ఈ మేరకు స్విస్ సూపర్ లీగ్‌తో పాటు సిరీస్ ఏ మ్యాచ్‌లను యూరోప్‌లో రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంగ్లాండ్‌లో మ్యాచ్‌లను పూర్తి స్థాయిలో రద్దు చేయకపోయినా.. 23 కరోనా వైరస్ కేసులు పాజిటివ్‌గా తేలడంతో మ్యాచ్‌లు కొనసాగించాలా లేదా అనే విషయంపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ ఆర్సెనల్ కోచ్ మైఖేల్ అర్టేటా ఈ విషయంపై స్పందించాడు. ‘ప్రస్తుతం కరోనా ప్రభావం ఏ మేరకు ఉందో మేం అంచనాకు వచ్చాం. మా ఆటగాళ్ల ఆరోగ్యం, ప్రాణ రక్షణ కోసం మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆయా ఆటగాళ్ల కుటుంబాలు ఈ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని’ ఆయన అన్నారు.
సోమవారం నుంచి ఫుట్‌బాల్ అసోసియేషన్ ఛాలెంజ్ కప్ (ఎఫ్ఏ కప్) ఐదో రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆర్సెనల్ క్లబ్ యాజమాన్యం ఇప్పటికే ఆటగాళ్లకు అన్ని రకాల సూచనలు అందించినట్టు మైఖేల్ తెలిపారు.