పుణెపై కరోనా పంజా..

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో రోజు రోజు కరోనా రక్కసి రెక్కలు విప్పుతున్న తరుణంలో మహారాష్ట్రలో కరోనా తీవ్రత మరింత పెరుగుతొంది. ముఖ్యంగా ముంబయి, పుణె, నాగ్‌పూర్‌లలో మహమ్మారి విజృంభిస్తున్న తీరు ప్రజలను కలవరపెడుతుంది. పుణెలోని పలు ప్రాంతాల్లో ఆస్పత్రులు పూర్తిగా నిండిపోవడంతో, కొత్తగా వచ్చి చేరుతున్న వారికోసం తాత్కాలిక గదులు ఏర్పాట్లు చేసి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పింప్రిలోని 400 పడకలు సామర్థ్యం గల యశ్వంత్‌రావ్‌ చవాన్‌ మెమోరియల్‌ ఆసుపత్రిలో గదులు […]

Update: 2021-04-06 10:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో రోజు రోజు కరోనా రక్కసి రెక్కలు విప్పుతున్న తరుణంలో మహారాష్ట్రలో కరోనా తీవ్రత మరింత పెరుగుతొంది. ముఖ్యంగా ముంబయి, పుణె, నాగ్‌పూర్‌లలో మహమ్మారి విజృంభిస్తున్న తీరు ప్రజలను కలవరపెడుతుంది. పుణెలోని పలు ప్రాంతాల్లో ఆస్పత్రులు పూర్తిగా నిండిపోవడంతో, కొత్తగా వచ్చి చేరుతున్న వారికోసం తాత్కాలిక గదులు ఏర్పాట్లు చేసి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పింప్రిలోని 400 పడకలు సామర్థ్యం గల యశ్వంత్‌రావ్‌ చవాన్‌ మెమోరియల్‌ ఆసుపత్రిలో గదులు సరిపడక వెయిటింగ్‌ ఏరియాలోను బాధితులకు ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి నెలకొంది.

పుణె వ్యాప్తంగా కేవలం 79 మాత్రమే వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న పడకలు ఉండడంతో, రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వెంటిలేటర్ల కొరత నెలకొంది. సోమవారం పుణెలో 8,075 కొత్త కేసులతో అక్కడ ఇప్పటి వరకు రికార్డయిన కేసుల సంఖ్య 5.8 లక్షలకు చేరుకుంది.

 

Tags:    

Similar News