ఆ ఐదు రాష్ట్రాల వల్లనే కేసులు పెరుగుతున్నాయ్

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా గడచిన 24గంటల్లో నమోదైన కేసులు అంతకు ముందురోజుకన్నా దాదాపు పది వేలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 72వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ రికవరీ మాత్రం ఇంతకంటే ఎక్కువే (82 వేలకు పైగా) ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 67.57 లక్షలకు చేరుకోగా రికవరీ కేసుల సంఖ్య 57.44 లక్షలుగా ఉంది. మొత్తం కేసుల్లో రికవరీ శాతం […]

Update: 2020-10-07 11:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా గడచిన 24గంటల్లో నమోదైన కేసులు అంతకు ముందురోజుకన్నా దాదాపు పది వేలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 72వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ రికవరీ మాత్రం ఇంతకంటే ఎక్కువే (82 వేలకు పైగా) ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 67.57 లక్షలకు చేరుకోగా రికవరీ కేసుల సంఖ్య 57.44 లక్షలుగా ఉంది. మొత్తం కేసుల్లో రికవరీ శాతం 85. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొత్త కేసులు ఎక్కువగా పెరగడంతో జాతీయ స్థాయి గణాంకాల్లో కూడా పెరుగుదల కనిపించింది.

మొత్తం కేసుల్లో గానీ, మృతుల్లోగానీ ఎక్కువగా తొలి పది రాష్ట్రాలే ఉన్నాయి. కానీ కొత్త కేసుల్లో మాత్రం పై ఐదు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. తాజాగా 986 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మృతుల సంఖ్య 1.04 లక్షలు దాటింది. చాలా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చినా పది రాష్ట్రాల విషయంలో మాత్రం కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఆందోళనగా ఉంది. రానున్నది పండుగల సీజన్ కావడంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సైతం దుర్గా పూజ నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని, వైరస్ వ్యాప్తి కాకుండా ప్రభుత్వానికి సహకరించారని, స్వీయ నియంత్రణతో పాజిటివ్ బారిన పడకుండా చూసుకోవాలని కోరారు.

Tags:    

Similar News