కరోనా@ కామారెడ్డిలో సెంచరీ.. నిజామాబాద్‌లో ఎన్నంటే..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పంజా విసిరింది. సెకండ్ వేవ్‌లో తొలిసారిగా కామారెడ్డి జిల్లాలో 100 కొత్త కేసులు నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో వందకు చేరువయ్యాయి. తాజాగా కరోనా బారిన పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సోమవారం కామారెడ్డిలో 1,181 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,078 మందికి నెగిటివ్ రాగా 103 మందికి పాజిటివ్ వచ్చింది. భీర్కుర్ ఆరోగ్య కేంద్రం […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పంజా విసిరింది. సెకండ్ వేవ్‌లో తొలిసారిగా కామారెడ్డి జిల్లాలో 100 కొత్త కేసులు నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో వందకు చేరువయ్యాయి. తాజాగా కరోనా బారిన పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సోమవారం కామారెడ్డిలో 1,181 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,078 మందికి నెగిటివ్ రాగా 103 మందికి పాజిటివ్ వచ్చింది.
భీర్కుర్ ఆరోగ్య కేంద్రం పరిధిలో 21 మందికి, కామారెడ్డిలోని రాజీవ్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో 21 మందికి కరోనా సోకింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,434కు చేరింది. గత ఐదు రోజులుగా కామారెడ్డి జిల్లాలో 329 కొత్త కేసులు వెలుగు చూశాయి. నిజామాబాద్ జిల్లాలో సోమవారం 95 కేసులు నిర్దారణ అయ్యాయి. 2,348 మందిని శాంపిల్స్ టెస్టు చేయగా 2,253 మందికి నెగెటివ్ రాగా, జిల్లాలో 18,799 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. నిజామాబాద్‌లో గత ఐదు రోజుల్లో 438 కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.