సీఎం వ్యాఖ్యల వల్లే కరోనా కేసులు పెరిగాయి

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కరోనా తీవ్రత లేదని ముఖ్యమంత్రి కేసీఆర్​చెప్పడం వల్లే ప్రజలు స్వేచ్ఛగా తిరిగారని, దాంతో కేసులూ పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ​అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్​ఆఫీసులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్​ మాట్లాడుతూ.. కరోనా మరణాలన్నీ సర్కార్​హత్యలేనన్నారు. సీఎం కేసీఆర్​కు కరోనాను నియంత్రించాలనే కనీస సోయి లేదని, అందుకే ఆయన ఇప్పటి వరకూ ఒక్క ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించలేకపోయరని విమర్శించారు. ప్రధాన మంత్రి […]

Update: 2021-04-28 07:20 GMT

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కరోనా తీవ్రత లేదని ముఖ్యమంత్రి కేసీఆర్​చెప్పడం వల్లే ప్రజలు స్వేచ్ఛగా తిరిగారని, దాంతో కేసులూ పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ​అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్​ఆఫీసులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్​ మాట్లాడుతూ.. కరోనా మరణాలన్నీ సర్కార్​హత్యలేనన్నారు. సీఎం కేసీఆర్​కు కరోనాను నియంత్రించాలనే కనీస సోయి లేదని, అందుకే ఆయన ఇప్పటి వరకూ ఒక్క ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించలేకపోయరని విమర్శించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా కట్టడికి నిరంతరం ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రాలనూ అప్రమత్తం చేస్తు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర సర్కార్​కు మాత్రం ఆ ఆలోచన లేదని, పైగా మంత్రులు కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలు అసలు పరిస్థితికి భిన్నంగా ఉన్నాయని, తాము చూపిస్తున్న లెక్కలు సరైనవేనని రాష్ట్ర సర్కార్ గుండె మీద చేతులు వేసుకొని సమాధానం చెప్పగలదా..? అని ప్రశ్నించారు.

కరోనా నియంత్రణలో తెలంగాణ సర్కార్ దారుణంగా విఫలమై, ఆ నెపాన్ని కేంద్రం మీద నెట్టాలని చూస్తోందన్నారు. వైరస్​సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కరోనా బారి నుంచి ప్రజలను కాపాడే సిచ్యూయేషన్​కనిపించడం లేదన్నారు. కరోనా​కట్టడిలో కీలక భూమిక పోషించే వ్యాక్సినేషన్ అంశంపై మంత్రులకు చిత్తశుద్ధి లేదని, అసలు ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రులు ఇప్పటి వరకు వ్యాక్సిన్​ వేయించుకున్నారో..? లేదో..? సమాధానం చెప్పాలన్నారు.

యుద్ధ విమానాలు,రైళ్ల ద్వారా కేంద్రం ఆక్సిజన్​ట్యాంకర్లను తరలిస్తే.. తాము చేసిన కృషితోనే ఆక్సిజన్​అందుబాటులోకి వస్తోందని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రులు అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని,సీఎం కేసీఆర్​ఇప్పటికైనా వారిని కట్టడి చేయాలన్నారు. కరోనా ఉధృతి ఉన్నందున మున్సిపల్​ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వానికి సూచించామని, అయినా సర్కార్​ పట్టించుకోలేదన్నారు. అధికార పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. మున్సిపల్​ఎలక్షన్స్​లో ప్రజలు బీజేపీకే పట్టం కడుతారని భావిస్తున్నామన్నారు.

Tags:    

Similar News