భారత్‌లో నిన్న ఒక్కరోజే 1007 మంది మృతి
దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 62,064 కొత్త కేసులు నమోదయ్యాయి. 1007 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22 లక్షల 15,074 కు చేరింది. ఇందులో 15,35,743 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 6 లక్షల 34 వేల 949 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు […]
దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 62,064 కొత్త కేసులు నమోదయ్యాయి. 1007 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22 లక్షల 15,074 కు చేరింది. ఇందులో 15,35,743 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 6 లక్షల 34 వేల 949 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు ఇండియా వ్యాప్తంగా 44,386 మంది కరోనాతో మృతిచెందారు.
కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.45 కరోనా టెస్టులు చేయగా, అందులో నిన్న ఒక్కరోజే 4.77 లక్షల కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.