మహిళకు క‘రోనా’ ఇక్కట్లు

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం చేపడుతున్న లాక్‌డౌన్ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన ఓ మహిళా చిక్కుకుంది. ఎటుపోవాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. శనివారంరాత్రి రామతిరుగమ్ అనే తమిళనాడుకు చెందిన ఈ మహిళ కాచిగూడ రైల్వే‌స్టేషన్ వద్ద దిగింది. కరోనా కట్టడిలో భాగంగా రైళ్ళు, బస్సులు తదితర పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బంద్ కావడంతో కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఒంటరిగా గడుపుతోంది. తాను తమిళనాడు కొయంబత్తూరులోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తానని, తమిళనాడు వెళ్లాలని తెలిపింది. కనీసం తిరుపతి- […]

Update: 2020-03-23 06:05 GMT

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం చేపడుతున్న లాక్‌డౌన్ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన ఓ మహిళా చిక్కుకుంది. ఎటుపోవాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. శనివారంరాత్రి రామతిరుగమ్ అనే తమిళనాడుకు చెందిన ఈ మహిళ కాచిగూడ రైల్వే‌స్టేషన్ వద్ద దిగింది. కరోనా కట్టడిలో భాగంగా రైళ్ళు, బస్సులు తదితర పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బంద్ కావడంతో కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఒంటరిగా గడుపుతోంది. తాను తమిళనాడు కొయంబత్తూరులోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తానని, తమిళనాడు వెళ్లాలని తెలిపింది. కనీసం తిరుపతి- రేణుగుంట వరకు వెళ్లగలిగినా అక్కడ ఎలాగోలా ఓ సత్రంలో తలదాచుకుంటానని కన్నీటిపర్యంతమవుతోంది. హైదరాబాద్ పోలీసులు పది రోజులు బంద్ అని చెబుతున్నారే తప్ప తనను ప్రభుత్వ హోంకు తరలించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది రామతిరుగమ్.

Tags: corona, tamil nadu, kacheguda, rama tirugam

Tags:    

Similar News