ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం

దిశ, అశ్వారావుపేట టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపింది. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి గత రెండు రోజులుగా తరగతులకు హాజరు కావడం లేదు. ఇదే విషయంపై ఉపాధ్యాయులకు వాకబు చేయగా… కరోనా బారిన పడినట్లుగా తెలియడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తరగతిలోని 66 మంది విద్యార్థులకు, 17 మంది ఉపాధ్యాయులకు స్థానిక ప్రభుత్వ వైద్య బృందం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. […]

Update: 2021-11-26 09:47 GMT

దిశ, అశ్వారావుపేట టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపింది. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి గత రెండు రోజులుగా తరగతులకు హాజరు కావడం లేదు. ఇదే విషయంపై ఉపాధ్యాయులకు వాకబు చేయగా… కరోనా బారిన పడినట్లుగా తెలియడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తరగతిలోని 66 మంది విద్యార్థులకు, 17 మంది ఉపాధ్యాయులకు స్థానిక ప్రభుత్వ వైద్య బృందం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. అలాగే మండలంలోని గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 8 మంది విద్యార్థులకు నెగిటివ్ రిపోర్టులు రాగా.. ఉపాధ్యాయుడికి మాత్రం పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించి శానిటేషన్ పనులు నిర్వహించారు.

Tags:    

Similar News