విశాఖలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ..

దిశ, విశాఖపట్నం : విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై చేసిన భూ అక్రమణల వ్యాఖ్యలపై శనివారం ఇరువర్గాల వారు దేవునిపై ప్రమాణం చేయాలంటూ నిరసనలు తెలిపారు. దీనిలో భాగంగా వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విజయనిర్మల నగరంలోని షిర్డీసాయి ఆలయానికి వచ్చి ఎమ్మెల్యే వెలగపూడి దేవుడి దీపం ఆర్పాలని కోరడంతో ఆయా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరుకాలేదు. దీంతో నేరుగా ఆయా […]

Update: 2020-12-26 09:51 GMT

దిశ, విశాఖపట్నం : విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై చేసిన భూ అక్రమణల వ్యాఖ్యలపై శనివారం ఇరువర్గాల వారు దేవునిపై ప్రమాణం చేయాలంటూ నిరసనలు తెలిపారు. దీనిలో భాగంగా వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విజయనిర్మల నగరంలోని షిర్డీసాయి ఆలయానికి వచ్చి ఎమ్మెల్యే వెలగపూడి దేవుడి దీపం ఆర్పాలని కోరడంతో ఆయా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరుకాలేదు. దీంతో నేరుగా ఆయా వైసీపీ నాయకులు ర్యాలీగా ఎమ్మెల్యే ఆఫీస్‌ ముట్టడికి వెళ్లారు.

ఈ క్రమంలోనే వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేకు తీరుకు నిరసనగా వైసీపీ నాయకులు నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే వెలగపూడిపై ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని తూర్పు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఇరువర్గాల వారిని సర్దిచెప్పడంలో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వస్తే తాను ప్రమాణం ఎక్కడ చేయమన్నా చేస్తానని చెప్పారు. దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. అనకాపల్లి ఎమెల్యే, విజయసాయిరెడ్డి, ఎవరైనా ఒకే.. కానీ విజయసాయిరెడ్డి ఖచ్చితంగా రావాలి. ఒకరు సింహాద్రి అప్పన్న అన్నారు.. నేను సాయిబాబా ఆలయం అన్నాను.. ఎక్కడైనా ఒకే సాయిబాబా పాదాల వద్ద స్టాంప్ పేపర్‌పై రాసుకుని విజయసాయి రెడ్డి రావాలి.

తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. నిరూపించకపోతే తన రాజ్యసభ సభ్యత్వానికి విజయ సాయి రెడ్డి రాజీనామా చేయాలి. అనకాపల్లి ఎమ్మెలే అమర్ కూడా ఆరోపణలు చేశారు. సింహాద్రి అప్పన్న దగ్గరకు రమ్మన్నారు.. అక్కడకూ తాను వస్తానని, తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు. తొలుత నేను చెప్పిన సాయిబాబా ఆలయానికి రావాలి. ఆ తరువాత అప్పన్న గుడికి నేనొస్తా. అనకాపల్లి ఎమ్మెల్యే అప్పన్న దగ్గరకు వచ్చినప్పుడు.. విజయసాయికూడా రావాలి. నా సవాల్ ను స్వీకరించండి.. నేను వస్తా’ అని వెలగపూడి పేర్కొన్నారు.

Tags:    

Similar News